మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా గురించి మరో క్రేజీ అండ్ లేటెస్ట్ అప్‌డేట్ లీకైంది. జక్కన్న ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా అప్‌డేట్స్ బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా ఏ అప్‌డేట్ వచ్చిందో వివరాలు తెలుసుకుందాం.
SSMB 29 అంటే రాజమౌళి మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఇంటర్నేషనల్ సినిమా. మహేశ్ బాబుతో పాటు ప్రియాంకా చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. ఆఫ్రికా అడవుల్లో సినిమా షుూటింగ్ కోసం పూర్తిగా ఏర్పాట్లు చేసుకుంటున్న జక్కన్న..సినిమా గురించిన వివరాలేవీ లీక్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పూర్తిగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లానింగ్ నడుస్తోంది. సినిమా షూటింగ్ ప్రారంభమైందే కానీ ఎలాంటి లీక్ లేదు. అధికారిక ప్రకటన లేదు. టెక్నికల్ టీమ్, నటీ నటులు వంటి వివరాలేవీ అందుబాటులో లేవు. ఎందుకంటే జక్కన్న ఏ వివరాలు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు.
అయినా సరే తాజాగా కొన్ని వివరాలు లీకయ్యాయి. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రకు విక్రమ్,నానా పటేకర్‌లను ట్రై చేసిన జక్కన్న ఇప్పుడు మాధవన్‌కు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు తండ్రిగా మాధవన్ కన్పించనున్నాడు. ఇటీవల ఒడిశాలో జరిగిన షెడ్యూల్‌లో కొన్ని సీన్లు లీకయ్యాయి. అందులో మహేశ్ బాబుని రౌడీలు లాక్కుని రావడం, పృథ్వీరాజ్ సుకుమారన్ కుర్చీలో కూర్చుని ఉన్నట్టు కన్పించింది.
సినిమా గురించి ఏ వివరాలు లీక్ కాకూడదని ఇప్పటికే రాజమౌళి తన టీమ్‌ని హెచ్చరించాడు. అయినా అప్పుడప్పుడూ లీకులు వస్తూనే ఉన్నాయి. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.