Naga Vamsi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి నెగిటివ్ సేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. పవన్, రానాల మధ్య సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి. ఇక, భీమ్లా నాయక్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో మొదట బాలకృష్ణను హీరోగా అనుకున్నారంట నిర్మాత, దర్శకులు.
అయితే, ఆ స్టోరీ తనకు సెట్ కాదని, పవన్ కల్యాణ్‌తో తీయమని నిర్మాత నాగవంశికి బాలకృష్ణ సలహా ఇచ్చారంట. ఈ విషయాన్ని స్వయంగా నాగవంశీనే తెలియజేశాడు. అది కూడా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’లో. అన్‌స్టాపబుల్ సీజన్ 2.. సెకండ్ ఎపిసోడ్ గెస్ట్‌గా హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నల గడ్డ, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగవంశీ భీమ్లా నాయక్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బాలకృష్ణ, నాగవంశీల మధ్య సంభాషణ ఇలా జరిగింది..
బాలకృష్ణ: భీమ్లా నాయక్‌కు ఎవరు ఫస్ట్ హీరో?
నాగవంశీ : మీరే సార్!!
బాలకృష్ణ: మరి ఏంటి? ఏం జరిగింది?
నాగవంశీ : ‘సార్ నేను మీ చుట్టూ తిరిగి, మిమ్మల్ని అడిగి, మీరు సినిమా చూసి.. మీరే కదా సార్ కల్యాణ్ గారిని నాకు సజెస్ట్ చేశారు. ఆయన తీస్తే బాగుంటుంది అని..
ఇలా ఇద్దరి మధ్యా సంభాషణ సాగింది. కాగా, తాజాగా ప్రారంభమైన అన్‌స్టాపబుల్ సీజన్ 2 మంచి రేటింగ్‌తో దూసుకుపోతోంది. సీజన్ 2 మొదటి ఎపిసోడ్ గెస్ట్‌లుగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు పాల్గొన్నారు. చంద్రబాబు షోలో ఎన్నో పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. బావా, బావమరిది ఎంతో ఫన్నీగా ఈ షోను ముందుకు తీసుకెళ్లారు. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఎపిసోడ్‌ను ఫన్ ఫుల్‌గా ఎండ్ చేశారు.
#MentalPower pic.twitter.com/gCWtFsRS7G
— . (@alag___) October 21, 2022