తమ ఫేవరెట్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. ఈ హీరోయిన్ మాత్రం అస్సలు నటించనని చెప్పేస్తోంది! ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తను ఎందుకు నటించనను అనే విషయాన్ని కూడా చెప్పింది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆమెని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే ‘ట్యాక్సీవాలా’ మూవీతో హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ నే.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక విషయానికొస్తే.. అనంతపురంలో పుట్టిన ప్రియాంకని చూస్తే ఎవరూ తెలుగమ్మాయి అనుకోరు. నార్త్ ఇండియన్ అమ్మాయిలా ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ట్యాక్సీవాలా సినిమాతో పాటు పాటు ఎస్ఆర్ కళ్యాణ మండపం, తిమ్మరుసు, ‘గమనం’లో నటించింది. ప్రస్తుతానికైతే ఎలాంటి సినిమాలు లేదా వెబ్ సిరీసులు చేయడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ రెచ్చగొట్టే ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు నెటిజన్లని ఎంటర్ టైన్ చేసే ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
‘పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలన్నీ చూస్తాను. ‘తమ్ముడు’ మూవీని 20 సార్లు కంటే ఎక్కువగానే చూశాను. ఇక ‘ఖుషి’ అయితే చెప్పనక్కర్లేదు. ఆ మూవీలోని ప్రతి డైలాగ్ ని ఈజీగా చెప్పేస్తా. అంత స్టార్ డమ్ ఉన్నా ఆయన మాత్రం ఆర్డినరీ మ్యాన్ లా, చాలా సింపుల్ గా ఎలా ఉంటారో నాకు అస్సలు అర్థం కాదు.’ అని ప్రియాంక జవాల్కర్ చెప్పింది. మరి ఆయన సినిమాలో అవకాశమొస్తే నటిస్తారా? అని యాంకర్ అడగ్గా.. ‘ఓ అభిమానిగా ఆయనని దూరం నుంచి చూస్తూ మురిసిపోతాను. అంతకు మించి ఏం కోరుకోవడం లేదు. ఆయనతో కలిసి యాక్ట్ చేయాలనే కోరిక లేదు. ఒకవేళ ఛాన్స్ వచ్చినా సరే చేయను.’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. మరి ఈమె వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.