పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ విడుదలకు రెడీ అయిపోయింది. ఇప్పటికే ట్రైలర్‌తో అంచనాలను అమాంతం పెంచేసిన ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. తాజాగా ముంబై మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్.. తన ప్రేమ, పెళ్లి పై స్పందించి షాకిచ్చాడు.
ఈ సందర్భంగా ‘‘ప్రేమ విషయంలో మీరు చెప్పే జోష్యం తప్పని సినిమాలో ఓ డైలాగ్ ఉంది. మరి రియల్ లైఫ్ లవ్ మేటర్ లో మీ జోష్యం ఎన్ని సార్లు తప్పయింది?” అని అడిగింది. దీనికి ప్రభాస్ సమాధానం ఇస్తూ.. ‘‘చాలాసార్లు అయింది. అందుకే నాకింకా పెళ్లి కాలేదని అనుకుంటున్నాను’’ అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఇక పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్‌కు జంటగా పూజా హెగ్డే నటించింది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన రాధేశ్యామ్ పై చిత్రబృందం చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో పామిస్ట్ గా కనిపించనున్నాడు ప్రభాస్. మరి ప్రభాస్ పెళ్లి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
