టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి పేరు చెప్పగానే కుర్రకారు గుండెలు లయ తప్పడం ఖాయం. ప్రభాస్-అనుష్క కాంబో అంటే ఫ్యాన్స్ పడిఛస్తారు కూడా. ఇద్దరి కాంబినేషన్ సినిమాపై క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇదే నిజమైతే అభిమానులకు ఫుల్ కిక్ లభిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బాహుబలి, మిర్చి సినిమాలతో టాలీవుడ్ బెస్ట్ పెయిర్‌గా ప్రభాస్ – అనుష్క శెట్టిలు ప్రాచుర్యం పొందారు. అసలు ఈ ఇద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా చూస్తుంటారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన అనుష్క తాజా సినిమా ఘాటీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. చాలా కాలం గ్యాప్ తరువాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో చాలా అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కోసం అనుష్క కొత్త శైలి అనుసరిస్తోంది. హీరో రాణాతో పోడ్ కాస్ట్ మాట్లాడుతూ అభిమానుల మనసులో ఉండే ప్రశ్నలకు జవాబిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చింది.
ప్రభాస్‌తో సినిమా చేయాలనుంది
ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేయాలనుందని అనుష్క వెల్లడించింది. అయితే బాహుబలిని మించిన స్క్రిప్ట్ లభిస్తేనే అది సాధ్యమౌతుందని చెప్పింది. అలాంటి కధ దొరికి ప్రభాస్‌కు నచ్చితో సినిమా చేసేందుకు సిద్ధమని తెలిపింది. అనుష్క చెప్పిన ఈ మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
వాస్తవానికి బాహుబలి తరువాత అనుష్క పెద్దగా సినిమాలు చేయడం లేదు. కధ బాగా నచ్చితేనే ఒప్పుకుంటానని అంటోంది స్వీటీ. ఇప్పుడు అభిమానుల్లో అనుష్క-ప్రభాస్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. బాహుబలి స్థాయి కధ లభిస్తుందా లేదా అనేది చూడాలి. ఇది అంత ఈజీ కానే కాదు. పోనీ బాహుబలి-3 వస్తుందా అంటే అది ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళి..సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత మహాభారతంపై దృష్టి పెట్టనున్నారు. మరి ప్రభాస్ అనుష్క కాంబో సినిమా రావాలంటే అనుష్క చెప్పిన విధంగా కధ దొరకాలి. ఆ కధ దొరుకుతుందో లేదో మరి..