టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాగా మారిన ప్రభాస్ గురించి ఎప్పటికీ విన్పించే ఒకే ఒక ప్రశ్న..అతని పెళ్లి ఎప్పుడు అనేదే. ఓ వైపు వయసు దాటుతోంది..పెళ్లి ఊసు కన్పించడం లేదు. మరో సల్మాన్ ఖాన్‌గా మారతాడా అనే వాదన కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ప్రభాస్ పెద్దమ్మ హింట్ ఇచ్చేసింది. ఆ వివరాలు మీ కోసం.
సినిమా ఇండస్ట్రీలో రోజూ ఎవరో ఒకరి గురించి గాసిప్స్ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక అంశం గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పటికీ ఎప్పటికీ అందరూ అడిగే ఒకే ఒక ప్రశ్న ప్రభాస్ పెళ్లెప్పుడనేదే. టాలీవుడ్‌లో ఇదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కల్గించే ప్రశ్న. పెళ్లి చేసుకుంటాడని అంటానే తప్ప ఎప్పుడు అనేది మాత్రం కన్పించడం లేదు. ఇప్పటికే అతని వయస్సు 45 దాటింది. చేతిలో రాజాసాబ్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ వంటి సినిమాల జాబితా చాలానే ఉంది. ఇంకా అన్ షెడ్యూల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి ఎప్పటికి పూర్తవుతాయి, పెళ్లెప్పుడు చేసుకుంటాడనేది అర్ధం కాని ప్రశ్న.
పెళ్లి అప్పుడేనా
ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై హింట్ ఇచ్చేసింది. తాజాగా ద్రాక్షరామం ఆలయాన్ని సందర్శించిన ఆమె ప్రభాస్ పెళ్లి కోసం ప్రత్యేక పూజలు జరిపించింది. అనంతరం మీడియాతో మాట్లాడింది. పరమ శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి అని ఎప్పుడనేది తాను చెప్పలేనని చెప్పేశారు. అదే విధంగా త్వరలో ప్రభాస్ చెల్లెళ్లకు కూడా పెళ్లి జరిపిస్తానని అన్నారు. మొన్నటి వరకూ ప్రభాస్ పెళ్లి మాట రాగానే అనుష్క పేరు విన్పించేది. కానీ ఈ మద్యన ఇద్దరికిద్దరు తాము కేవలం స్నేహితులమని చెప్పడంతో ఆ టాపిక్ మర్చిపోయారు ఫ్యాన్స్. అభిమాన హీరో పెళ్లి ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు.