పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయ పరిస్థితిలను ఒక్కసారిగా మార్చేశాయి. పవన్ కామెంట్స్ కి వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం.. నటుడు, రచయత పోసాని కృష్ణ మురళి సైతం ఈ విషయంలో పవన్ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పోసాని ప్రెస్ మీట్ తరువాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనపై కోపంతో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఫ్యాన్స్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు అంటూ పోసాని మరోసారి మీడియా ముందుకి వచ్చారు. ఈ నేపథ్యంలో పోసాని రెచ్చిపోయి కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ ఒక సైకో అంటూ, పవన్ ఫ్యాన్స్ కూడా సైకోలు అంటూ పోసాని విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని వ్యక్తిగత ఆరోపణలకు కూడా దిగారు.ఇక మీడియాలో పోసాని ప్రెస్ మీట్ ప్రసారం కావడంతో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత వాతారవరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అంతా ప్రెస్ క్లబ్ వద్దకి చేరుకుని పోసాని ప్రెస్ మీట్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసులు పవన్ ఫ్యాన్స్ ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. జన సైనికులు ఈ విషయంలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.