హీరో నాని.. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇప్పుడు అతడు నటించే కొత్త సినిమా కోసం ఏకంగా పవన్ కల్యాణ్ టైటిల్ ని ఉపయోగించబోతున్నారట.
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూనే ఉంటుంది. కొన్నేళ్ల ముందు వరకు పాత పాటల్ని రీమేక్స్ చేసేవారు. పాత సినిమా టైటిల్స్ ని కాస్త అటు ఇటు మార్చి వాడేసుకునేవారు. సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ఇలా చేసేవారు. ప్రేక్షకులు కొన్నిసార్లు వీటిని పెద్దగా పట్టింకోనప్పటికీ.. కొన్ని సందర్భాల్లో సదరు హీరోలపై విపరీతమైన ట్రోలింగ్ చేసేవారు. నేచురల్ స్టార్ నానికి గతంలోనే ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయినా సరే ఇప్పుడు మరోసారి అదే సాహసం చేస్తానని అంటున్నాడు.
ఇక విషయానికొస్తే.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా సెటిలైన వారిలో నాని కచ్చితంగా ఉంటాడు. ‘అష్టాచమ్మా’ దగ్గర నుంచి ‘అంటే సుందరానికీ’ వరకు దాదాపు 29 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ సక్సెస్ అందుకుంటున్నాడు. అయితే నాని పెద్దగా వివాదాల్లో ఉండదు. తన వరకు సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. అయితే ‘గ్యాంగ్ లీడర్’ మూవీ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఫేస్ చేశాడు.
చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’కి మెగా ఫ్యాన్స్ మనసులో ప్రత్యేక స్థానం ఉంది. అయితే విక్రమ్ కుమార్-నాని కాంబోలో వచ్చిన సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అని టైటిల్ పెట్టారు. దీంతో మెగాఫ్యాన్స్ ఈ విషయాన్ని తీసుకోలేకపోయారు. అప్పట్లో నానిని ట్రోల్ కూడా చేశారు. ఇప్పుడు మరోసారి మెగా టైటిల్ తో నాని సినిమా చేయబోతున్నాడని సమాచారం. నాని-వేణు శ్రీరామ్- దిల్ రాజు కాంబినేషన్ లో తీయబోయే చిత్రం కోసం ‘తమ్ముడు’ టైటిల్ ని పరిశీలిస్తున్నారని తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. నాని ఆ టైటిల్స్ కావాలనుకుంటున్నాడా? లేదా దర్శక నిర్మాతలు అలా పట్టుబడుతున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Wishing Our Dearest @NameisNani A Very Happy Birthday 🤗🎉
We LOVE YOU 3000 💝#HappyBirthdayNani ❤️#Nani #Dasara #Nani30 pic.twitter.com/rZyLGFiecC
— Nani Fans Association (@nfa_hyd) February 24, 2023