తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. అటు చిన్న హీరోల నుంచి ఇటు స్టార్ హీరోల వరకూ ఎక్కడ ఛాన్స్ దోరికితే అక్కడి వాలిపోతు వరుస సినిమాలకు సైన్ చేస్తోందీ బుట్టబొమ్మ. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టిన ఈ అందాల సుందరి తన మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. ఇక ఈ మూవీతో నుంచే అమ్మడుకు వరుస సినిమాలు క్యూ కట్టాయి.
అరవింద సమిత వీర రాఘవ, అలా వైకుంఠపురం, మహర్షి వంటి సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ తన అందం, చెందంతో కుర్రకారును బుట్టలో వేసుకుంటోందీ బుట్టబొమ్మ. ఇక అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించించిన చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా మంచి హిట్ తో దూసుకుపోతోంది. అయితే ఈ హీరోయిన్ గురించి తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’. ఈ మూవీలో పవన్ కు జోడిగా ఎవరు నటిస్తారనే వార్తపై గత కొంత కాలం నుంచి చర్చ నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు పవన్ కు జోడిగా మూవీ యూనిట్ పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.