స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన పాటలు వేరే స్టార్ హీరోల సినిమాల్లో వినిపిస్తే.. ఏ హీరో అభిమానికైనా ఆ కిక్కే వేరప్పా అనిపిస్తుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ కిక్కునే ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ ‘సర్కారు వారి పాట’ మూవీలో.. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలోని ‘లాలా భీమ్లా..’ సాంగ్ రింగ్ టోన్ లా వినిపించడం విశేషం.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో పవన్ కళ్యాణ్ సాంగ్ రింగ్ టోన్ గా వినిపించడంపై సోషల్ మీడియాలో ఇరువురి హీరోల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో నటుడు సుబ్బరాజ్ ఓ కీలకపాత్రలో నటించాడు. అయితే.. సినిమాలో సుబ్బరాజ్ పాత్రకు మొబైల్ రింగ్ టోన్ గా ‘లాలా భీమ్లా..’ సాంగ్ పెట్టి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. మహేష్ సినిమాలో పవన్ సాంగ్ వినిపించేసరికి ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ థియేటర్లలో పండగ చేసుకుంటున్నారు.
స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. ఇలా ఒక హీరో సినిమాలో మరో హీరో సాంగ్ వినిపించడం అనేది స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఓవైపు సర్కారు వారి పాట సినిమాలో మహేష్ పెర్ఫార్మన్స్ విజిల్స్ వేయిస్తుండగా.. మధ్యలో పవన్ కళ్యాణ్ సాంగ్ రింగ్ టోన్ లా వినిపించడంతో థియేటర్లలో సందడి మరోస్థాయికి చేరుకుంది. మరి మహేష్ సినిమాలో పవన్ సాంగ్ పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.