మెగాస్టార్ అంటే తెలుగు ప్రజలకు ఒక రకమైన వైబ్రేషన్ కలిగించే పేరు. ఆయన సినిమా రిలీజ్ అంటే మెగా ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆయనతో సినిమా తీయడం కోసం ఎందరో దర్శకులు ఎదురు చూస్తుంటారు. ఆయనతో సినిమా తీయడం ఒక గోల్ గా పెట్టుకున్న దర్శకులు ఎందరో. ” ఈరోజు కోసమే నేను వేచి ఉన్నాను, నా ఆల్ టైమ్ హీరోతో సినిమా తీయనున్నాను” అని బాబీ ట్వీట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి రాబోయే సినిమాలకు సంబంధించిన ఆసక్తికర సమాచారం కోసం అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి సమాచారం ఇప్పుడు మీ కోసం. చిరంజీవి తెలుగు సినీ ప్రపంచంలో మాస్ కు బ్రాండ్ అంబాసిడర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ 154వ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రం పోస్టర్ లో మెగాస్టార్ ముఠామేస్త్రీ స్టైల్ లో మాస్ లుక్ లో కనిపించారు.
#Mega154 Pooja event graced by the big wigs of the industry 💥
Clap by #VVVinayak garu ❤️
First shot direction by #RaghavendraRao garu ❤️
Camera switch on by @purijagan garu ❤️ pic.twitter.com/VrNV1MEbYP
— Mythri Movie Makers (@MythriOfficial) November 6, 2021
డైరెక్టర్ బాబీ మెగా అభిమానులకు ఓ శుభవార్త చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి 154వ చిత్రంలో పవన్ కళ్యాణ్ కూడా కనిపించనున్నారని సమాచారం. నిజ జీవితంలోని అన్నదమ్ములు.. ఒకే తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. గతంలో మృగరాజు, అంజి వంటి సినిమాల్లో మెగా బ్రదర్ నాగబాబు చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చూశాం. శంకర్ దాదా MBBS, జిందాబాద్ చిత్రాల్లో పవన్ అలా తళుక్కు మన్న విషయం తెలిసిందే. అయితే బాబీ చిత్రంలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తారా? లేక గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే ఉంటుందా అన్న దానిపై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే. ఇది మాత్రం నిజమైతే మెగా అభిమానులకు అది పండగరోజే అవుతుంది.
The day I’m waiting for quite a long time has arrived!! 🤗
Working with my all time favorite HERO Megastar @KChiruTweets garu for #MEGA154 ❤️
Presenting the ‘Mass Moola Virat’ in an avatar we love to see him the most 😎
Annayya Arachakam Arambham 🤩@MythriOfficial pic.twitter.com/olYEMnglJg— Bobby (@dirbobby) November 6, 2021