పవన్ కల్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటిది ఇప్పుడు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. సముద్రఖని డైరెక్ట్ చేసి, నటించిన వినోదయ సీతమ్ సినిమా రీమేక్ లో పవన్- సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ రాజకీయాలే కాకుండా.. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేస్తానన్న సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. అయితే ఆ సినిమాకి సంబంధించి అప్ డేట్ వచ్చిన విషయం తెలిసిందే. సముద్రఖని నటించి, డైరెక్ట్ చేసిన ‘వినోదయ సీతమ్’ సినిమాని తెలుగులో పవన్- సాయి ధరమ్ తేజ్ రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా పట్టాలెక్కినట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా విడుదల చేశారు. అయితే వినోదయ సీతమ్ సినిమా చూడని వాళ్లు అసలు కథ ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే అసలు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వినోదయ సీతమ్ సినిమా 2021లో విడుదలైంది. ఈ సినిమాకి సముద్రఖని డైరెక్ట్ చేయడమే కాకుండా భగవంతడి పాత్రలో నటించాడు. ఈ మూవీలో సముద్రఖని, తంబి నారాయణ ప్రధాన పాత్రల్లో నటించారు. తంబి నారాయణ ఒక సక్సెస్ ఫుల్ ఎంప్లాయ్, భర్త, తండ్రిగా భావిస్తుంటాడు. కుటుంబ పెద్దగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నాడనే భ్రమలో బతుకుతుంటాడు. అయితే అనుకోకుండా ప్రమాదంలో చనిపోతాడు. అతడికి తిరిగి బతికేందుకు సముద్రఖని అవకాశం ఇస్తాడు. అయితే కేవలం 3 నెలలు మాత్రమే ఉండేందుకు ఒప్పుకుంటాడు. ఆ సమయంలో తంబి నారాయణ్ కు తాను చేసిన తప్పులేంటి? కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టాలనుకున్నా తాను సాధించింది ఏంటి? అనే విషయాలు తెలుసుకోవడమే కథ.
Most ambitious & Powerful Combination #PSPK & #SDT project takes off today🤩
Keep your Bars High 📶
Bombarding updates on the way💥#PKSDT@PawanKalyan @IamSaiDharamTej@thondankani @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ pic.twitter.com/Qv3F2DGDA2
— SumanTV (@SumanTvOfficial) February 22, 2023
తెలుగులో ఇప్పుడు రీమేక్ చేయబోయే సినిమాకి కూడా సముద్రఖనినే డైరెక్షన్ చేయనున్నాడు. అయితే డైలాగులు, స్క్రీన్ ప్లే బాధ్యతలు మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నిర్వర్తించనున్నాడు. పవన్- సాయిధరమ్ తేజ్ అనగానే.. ఈ మూవీ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి పెరిగింది. ఎందుకంటే మాతృకలో తంబి నారాయణ్.. పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్న పాత్ర చేశాడు. ఆ పాత్రను సాయిధరమ్ తేజ్ కోసం ఎలా మార్చబోతున్నారు అనేదే పాయింట్. ఆ పాత్రను మార్చితే దాదాపుగా కథ మొత్తం మారిపోయే పరిస్థితి ఉంది. పవన్ మరోసారి దేవుని పాత్రలో కనిపించబోతున్నాడని తెలుసుకుని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. గోపాలా గోపాలా సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. పవన్- సాయి ధరమ్ తేజ్ కాంబో ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.