పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీ చింపిన కారణంగా విద్యార్థులను పీఎస్ తరలించిన విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. రెండ్రోజుల క్రితం విద్యార్థులు ఆడుకుంటూ వైసీపీ పార్టీకి చెందిన ఫ్లెక్సీ చింపారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఇద్దరు పిల్లలను పీఎస్ కు తరలించి వారిని గట్టిగానే మందలించారని సమాచారం. ఈ ఘటనపై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో పిల్లల్ని కూడా వదలడం లేదంటూ పవన్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: చంద్రబాబు, లోకేష్ లు చీరలు కట్టుకోవాలి! : మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో విద్యార్థులు కూర్చుని ఉన్న ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. స్కూల్ కు వెళ్లే చిన్నారులను అలా పోలీసులు పీఎస్ కు ఎలా తరలిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫ్లెక్సీ చింపినంత మాత్రాన పిల్లలకు పోలీస్ స్టేషన్ లో అలా కౌన్సిలింగ్ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
YCP Govt is not even sparing kids. Sad.. https://t.co/qXkZD9tBjc
— Pawan Kalyan (@PawanKalyan) April 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.