పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో పర్యటించేందుకు.. వారాహి పేరుతో ప్రత్యేక వాహానాన్ని సిద్ధం రెడీ చేయించారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా.. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. తన చేతిలో ఉన్న సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒక నెట్టింట వైరలవుతోంది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత మొదలు పెట్టాను అంటూ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఇంతకు పవర్ స్టార్ 20 ఏళ్ల తర్వాత ఏం మొదలు పెట్టారు.. అనేది తెలియాలంటే..
టాలీవుడ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉన్న హీరో ఎవరంటే.. వెంటనే వినవచ్చే సమాధానం పవన్ కళ్యాణ్. పలు చిత్రాల్లో తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభను ప్రదర్శించారు. ఇక మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా జాని సినిమాను.. పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ వైపు వెళ్లలేదు. ఈ క్రమంలో తాజాగా పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 20 ఏళ్ల తర్వాత.. మళ్లీ మార్షల్ ఆర్ట్స్ మొదలు పెట్టాను అంటూ పవర్ ఫుల్ లుక్‌లో ఉన్న ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజనులు.. 20 ఏళ్ల అయినా మీలో ఫైర్ ఏమాత్రం తగ్గలేదు అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
After two decades I got into my Martial Arts practice. pic.twitter.com/3CLqGRNbvH
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022