పవన్ కళ్యాణ్ అరుదైన ఘనతను సాధించారు. ఏ హీరో చేయలేనటువంటి పని పవన్ కళ్యాణ్ చేశారు.
స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తి చేయాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అయితే ఇంకెంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానటువంటి రికార్డును పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. కేవలం నెల రోజుల్లోపే ఒక సినిమాను పూర్తి చేశారు. అది కూడా తన చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా సినిమాని ఫినిష్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమాలు చేస్తుండగా.. రీసెంట్ గా సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వినోదయ సితం తెలుగు రీమేక్ వెర్షన్ లోని తన భాగాన్ని పూర్తి చేశారు. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ప్రారంభమైన ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ పోర్షన్ ను పూర్తి చేసుకున్నారు. కేవలం 24 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశారు. ఈ మధ్యకాలంలో ఇంత షార్ట్ టైంలో పవన్ కళ్యాణ్ ఏ సినిమాను పూర్తి చేయలేదు. రోజూ ఉదయాన్నే షూటింగ్ కు వెళ్లి.. రాత్రి వరకూ చేసి 24 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు.
ఈ విషయంలో పవన్ కమిట్మెంట్ ను మెచ్చుకోవాల్సిందే. ఒక పక్క రాజకీయాలు చూసుకోవాలి, మరో పక్క సినిమాలు చూసుకోవాలి. ఇంత బిజీగా ఉంటూ కూడా పవన్ తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడమంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయనున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఏప్రిల్ 5 నుంచి మొదలుకానుండగా.. ఆ తర్వాత సుజిత్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలు చేస్తారని తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.