'ఆర్ఆర్ఆర్' పాట ఆస్కార్ గెలుచుకోవడం అనేది పాత అయిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఓ విషయంలో టాప్ లో నిలిచాడనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా విషయం?
ఆస్కార్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు పాటని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. దీంతో దేశమొత్తం ఈ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తెగ మెచ్చుకుంటున్నారు. ఇక ఇందులో డ్యాన్స్ చేసిన హీరోలు రామ్ చరణ్-ఎన్టీఆర్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరోలను వెనక్కి నెట్టి మరీ టాప్ లో నిలవడం విశేషం. ఇంతకీ ఏంటి విశేషం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో హీరోలు చరణ్-తారక్ ఇద్దరికీ గ్లోబల్ వైడ్ గుర్తింపు వచ్చింది. హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ ఈ ఇద్దరి గురించి తెగ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఆస్కార్ వేడుకలో ఎన్టీఆర్-రామ్ చరణ్ పాల్గొన్నారు. వాళ్ల డ్రస్సింగ్ స్టైల్ నుంచి ప్రతిదీ అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే నందమూరి హీరో అరుదైన రికార్డు నెలకొల్పినట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతున్న టైంలోనే చరణ్-తారక్ గురించే ఎక్కువగా డిస్కషన్ నడిచింది. అయితే ఇందులో ఎన్టీఆర్ టాప్ లో నిలిచాడు. చరణ్ రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ‘ఎవ్రీథింగ్’ నటుడు కె హ్యూయ్ ఖాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్, అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
నెట్ బేస్ క్విడ్ అనే డేటా విశ్లేషణ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆస్కార్ వేడుక జరుగుతున్న టైంలో సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అందరికంటే ఎక్కువగా మెన్షన్ చేసిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని చెప్పిన సదరు సంస్థ ఓ ఫొటోని కూడా రిలీజ్ చేసింది. అలా ఈసారి ఆస్కార్ వేడుకని సుమారు 18.7 మిలియన్ల మంది చూశారట. ఏబీసీ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ అవార్డుల కార్యక్రమం చూసిన వారి సంఖ్య 12 శాతం పెరిగింది. మరోవైపు దాదాపు 1.05 మిలియన్ల మంది ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతా @tarak9999 ని మెన్షన్ చేశారు. ఇలా ఈ విషయంలోనూ తారక్ టాప్ లో నిలవడం విశేషమనే చెప్పాలి.మరి ఎన్టీఆర్ టాప్ మెన్షన్స్ లో నిలవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
