తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. జూనియర్ యన్టీఆర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా యన్టీఆర్ బరువెక్కిన హృదయంతో మాట్లాడారు.. కొన్ని సార్లు మన ఆవేదనను, భాదను వ్యక్తపరచడానికి మాటలు రావు. అలాంటి భావాలను ఆ మహానుభావుడు తన కలంతో వ్యక్తపరిచారు.
బహుశా ఈ ఆవేదానును ఆయన తన కలంతోనే వ్యక్తపరిస్తే బావుండేదని తారక్ ఎమోషనల్ అయ్యారు. రాబోయే తరానికి ఈ పాటలు ఆదర్శవంతంగా ఉంటాయని.. ఆయన పాటలు బంగారు బాటలు అవుతాయని అన్నారు. తెలుగుజాతి బతికున్నంత కాలం.. ఆయన సాహిత్యం బతికే ఉంటుంది అని యన్టీఆర్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.