తెలుగు సినిమా చరిత్రలో రాజమౌళి సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ వేదికగా ఎన్నో ఘనతలు సాధించిన రాజమౌళి మరో ఘనతను సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో ఉన్నారు. రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు 95వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్ లో స్థానం దక్కించుకుని.. చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో నిలిచింది. ట్రిపులార్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ ఫర్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది.
ఇప్పటికే గోల్డెన్ గోల్బ్ అవార్డు దక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్ చరిత్ర సృష్టించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. 95వ అకాడమీ అవార్డ్స్ లో లేడీ గాగా, డెయిన్ వారెన్, రిహాన్నా, ర్యాన్ లాట్ వంటి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో కీరవాణి పోటీ పడనున్నారు. ఈ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కితే ఇండియన్ సినిమా ఖ్యాతి విశ్వ విఖ్యాతమవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కీరవాణి- చంద్రబోస్ సృష్టించిన ఈ మ్యూజిక్ వండర్ కు ఆస్కార్ దక్కాలంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆకాంక్షిస్తున్నారు. మరి.. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ దక్కాలని మీరూ కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This year’s Original Song nominees are music to our ears. #Oscars #Oscars95 pic.twitter.com/peKQmFD9Uh
— The Academy (@TheAcademy) January 24, 2023