మెగాస్టార్ చిరంజీని 70వ జన్మదినోత్సవం పురస్కరించుకుని మెగా 157 సినిమా టైటిల్ ప్రకటించారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఊహించినట్టే మన శంకరవరప్రసాద్ గారు టైటిల్ ఖరారైంది. అంతేకాదు ట్యాగ్‌లైన్‌లో పండగకి వస్తున్నారు అని చెప్పడం ద్వారా రిలీజ్ డేట్ కూడా ఖరారు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులకు ఫుల్ మీల్చ్ లభించేశాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. అంచనాలకు తగ్గట్టే గ్లింప్స్ అద్దిరిపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇవాళ 70వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో 156వ సినిమా విశ్వంభరుడితో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుందని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్న ఈ సినిమా పోస్టర్, పాటలు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. ఇక మెగా 157 ప్రాజెక్టుపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ కానుంది. ఫలితంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇవాళ చిరు పుట్టినరోజు పురస్కరించుకుని సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి టైటిల్ టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాకు ఊహించినట్టే మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఖరారు చేయడమే కాకుండా ట్యాగ్‌లైన్‌గా పండగకి వస్తున్నారు అని పెట్టడం ద్వారా రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చారు. ఇక ఈ టీజర్ వీడియో వెంకీ వాయిస్‌తో రివీల్ చేయడంతో ఇంకా అద్దిరిపోయింది. వీడియోలో బీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ సంగీతం సూపర్బ్‌గా ఉంది. అంతేకాకుండా సూట్ వేసుకుని స్టైల్‌గా సిగరెట్ కాల్చుతూ కారు దిగి వస్తున్న లుక్ అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తోంది. చివరిలో గుర్రం పట్టుకుని నడిచొచ్చే షాట్ కూడా సూపర్ అంటున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది. ఇక సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానులకే కాదు చిరంజీవికి సైతం భారీ అంచనాలున్నాయి.