ఇటీవల కురిసినటువంటి భీకరమైన వర్షాలకు ఏపీలోని అన్ని జిల్లాలు భారీ నష్టాలకు గురయ్యాయి. అలాగే వర్షపాతం నమోదైన అన్ని ప్రాంతాల్లో వరదల ధాటికి సామాన్య జనాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం పై ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ జనాలకు అందాల్సిన కనీస అవసరాలకు లోటు మాత్రం అలాగే ఉంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నేతలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా స్పందించడం చూస్తుంటాం. అలాగే వారికి తోచినంత ఆర్థిక విరాళాలు అందిస్తుంటారు.
తాజాగా ఏపీలో జరిగిన భారీ నష్టాలను, వరదలలో సామాన్యుల ఇబ్బందులను చూసి చలించిన టాలీవుడ్ యంగ్ టైగర్ యన్టీఆర్ పెద్ద మనసుతో స్పందించాడు. ఇటీవలే ఏపీ వరద బాధితుల పరిస్థితి చూసి చలించిపోయానని, అందుకే వారి సహాయార్థం తన వంతుగా వారికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం ద్వారా అందించనున్నట్లు యన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అలాగే వరద బాధితులకు ఇటీవల గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ కూడా 10 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7న రిలీజుకు రెడీ అవుతోంది. ఈ సినిమా అనంతరం యన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో రెండో సినిమా చేయనున్నాడు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపిలో వరద బాధితుల కడగండ్లు చూశాక కలచివేసిందని తెలిపారు. అందుకే వారికి సాయంగా తన వంతుగా రూ.25 లక్షలు విరాళంగా ఇస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఇద్దరు హీరోలు తమ పెద్ద మనసు చాటుకోవడంతో యన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషాన్ని ప్రకటించారు.
Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery.
— Jr NTR (@tarak9999) December 1, 2021
In light of the devastating floods in Andhra Pradesh, I would like to contribute 25 lakhs towards the CMRF. Request everyone to come forward and help AP during this hour of crisis. 🙏@ysjagan @AndhraPradeshCM
— Mahesh Babu (@urstrulyMahesh) December 1, 2021