Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన ఆహ్వానం అందింది. స్వాతంత్ర సమర యోధుడు, మన్యం దొర అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతో మెగాస్టార్ వేదిక పంచుకోబోతున్నారు. ఈ మేరకు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవిని లేఖ ద్వారా ఆహ్వానించారు. జులై 4న భీమవరంలో జరగబోయే కార్యక్రమానికి తప్పకుండా రావాలని లేఖలో కోరారు. ప్రధాన మంత్రి ప్రోగ్రామ్‌లో భాగం కావాలన్నారు. అంతేకాదు! మన్యం వీరుడి గౌరవార్ధం కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఓ సంవత్సరం పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనుందని, కొన్ని కార్యక్రమాలు ఘన విజయం సాధించటానికి చిరంజీవి మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇక, భీమవరంలో జరగబోయే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు సినిమా రంగం నుంచి కేవలం మెగాస్టార్‌కు మాత్రమే ఆహ్వానం అందింది. దీన్ని బట్టే తెలుస్తుంది చిరు క్రేజ్ ఏంటో. ఈ వార్తతో చిరు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకే వేదికపై ఓ వైపు దేశాన్ని ఏలుతున్న రారాజును, మరో వైపు వెండి తెరను ఏలుతున్న ‘మగ మహారాజు’ను చూడటం కన్నుల పండుగగా ఉండనుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో ఈ వార్తను షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. మరి, మెగాస్టార్ చిరంజీవికి అందిన ఈ ప్రత్యేక ఆహ్వానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bigg Boss Season 6 Telugu: బిగ్‌బాస్ 6లోకి వడ్డే నవీన్.. కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ ఆఫర్!