సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్.. త్వరలోనే బిడ్డకు జన్మనిచ్చి తల్లి కాబోతుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కాజల్.. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ సమక్షంలో సీమంతం వేడుక వైభవంగా జరిగింది. ఇక కాజల్ తన సీమంతం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం కాజల్ సీమంతం ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ గా చేతినిండా సినిమాలు ఉన్న సమయంలో కాజల్.. తన చిరకాల స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి 2020 అక్టోబరులో జరిగింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే కాజల్ ‘సీత’ సినిమాతో కెరీర్లో 50 సినిమాల మార్క్ చేరుకుంది. 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన కాజల్.. చందమామ, మగధీర సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది.
అప్పటినుండి స్టార్ హీరోయిన్ స్టేటస్ తో వరుసగా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. కెరీర్ లో డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, నా పేరు శివ, బిజినెస్ మెన్, టెంపర్, నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150 సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం కాజల్ సినిమాల విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ సరసన నటించిన ‘’హే సినామిక’’ మార్చి 3న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. మెగాస్టార్ చిరు సరసన చేసిన ‘ఆచార్య‘ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హీరోయిన్ కాజల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.