ఒకరు బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి లేటెస్ట్ గా ఒక తెలుగు సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న ఆర్టిస్ట్. ఇంకొకరు జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి కొన్ని తెలుగు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్ ని పోషించిన ఆర్టిస్ట్.
ఒకరు బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి లేటెస్ట్ గా ఒక తెలుగు సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న ఆర్టిస్ట్. ఇంకొకరు జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి కొన్ని తెలుగు సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్ ని పోషించిన ఆర్టిస్ట్. తాజాగా జబర్దస్త్ ఆర్టిస్ట్ కి చెందిన భార్య శ్రీమంతం జరిగింది. ఆ శ్రీమంతంలో బిగ్ బాస్ ద్వారా పరిచయమైన నటుడి శ్రీమంతం కూడా జరిగింది. వినడానికి విచిత్రంగా ఉన్నా వాస్తవం. సయ్యద్ సోహైల్ రియాన్.. బిగ్ బాస్ షో లో సూపర్ గా పెర్ఫార్మ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇస్తున్నాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ అనే ఒక వెరైటీ సినిమా ద్వారా వెండి తెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
ఈ సినిమా హీరోకి సంబంధించి జరిగిన ఒక విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. జబర్దస్ ప్రోగ్రాం ద్వారా ముక్కు అవినాష్ ఎంత పాపులర్ ఆర్టిస్ట్ అయ్యాడో అందరికీ తెలిసిన విషయమే. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని నవ్విస్తాడు. తాజాగా అవినాష్ భార్య శ్రీమంతం వేడుకలు చాలా ఘనంగా జరిగాయి .ఈ వేడుకలకి సయ్యద్ సోహైల్ కూడా హాజరయ్యి నేను కూడా ప్రెగ్నెంట్ అని తనకి కూడా శ్రీమంతం చేయాలని కోరాడు. మొదట ఆశ్చర్యపోయిన ముక్కు అవినాష్ సోహైల్ కి కూడా శ్రీమంతం చేసాడు. ఈ సందర్భంగా తన మాట కాదనకుండా తనకు శ్రీమంతం జరిపించిన ముక్కు అవినాష్ కి సయ్యద్ ధన్యవాదాలు తెలిపాడు.
అలాగే ఆగస్టు 18 న డెలివరీ డేట్ ఇచ్చారని అక్కడున్న అతిథులందరికీ చెప్పాడు. ఆ తర్వాత ఇదంతా మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీకి సంబంధించిన పబ్లిసిటీ కోసం అని అందరు తెలుసుకొని హ్యాపీగా నవ్వుకున్నారు. సోహైల్ హీరోగా రూప కొడువాయూర్ హీరోయిన్ గా సుహాసిని మణిరత్నం ముఖ్య పాత్రలో నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ఈ రోజు విడుదలయ్యింది. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రచనా దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది.