‘గీ ముసురు సలిలో మంట లాంటి ముచ్చట’ అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఖుష్ అయ్యే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నటసింహ నందమూరి బాలకృష్ణ - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’.
‘గీ ముసురు సలిలో మంట లాంటి ముచ్చట’ అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఖుష్ అయ్యే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నటసింహ నందమూరి బాలకృష్ణ – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’ (I Don’t Care). కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ కాగా యంగ్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల, బాలయ్య కూతురిగా కనిపించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహూ గారపాటి – హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ విలన్‌గా చేస్తున్నారు. బాలయ్య బర్త్‌డేకి రిలీజ్ చేసిన టీజర్ సినిమా అంచనాలు పెంచేసింది. తెలంగాణ యాసలో డైలాగ్స్ అదరగొట్టేశారు నటసింహ.
ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే బాలయ్య దసరా బరిలో దిగబోతున్నాడని చెప్పిన నిర్మాతలు, శనివారం (జూలై 22)న విడుదల తేదీ ఖరారు చేశారు. ‘భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ అంటూ అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కాబోతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. పండక్కి లాంగ్ వీకెండ్ కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో బాలయ్య వయసు తగ్గ పాత్రలో కనిపించనున్నారు. యంగ్ ఏజ్‌లో జైలుకెళ్లి, వయసుపైబడ్డాక విడుదలై బయటకు వచ్చే క్యారెక్టర్ అని తెలుస్తుంది. అందుకు తగ్గట్టే బాలయ్య గెటప్, కాస్ట్యూమ్స్ అన్నీ సరికొత్తగా ఉన్నాయి. ఆయన మార్క్ సీరియస్ యాక్షన్‌తో పాటు తన స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు అనిల్.
ఇప్పటికే దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్‌ల ‘లియో’ అక్టోబర్ 19 రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న రాబోతుంది. రామ్, బోయపాటిల ‘స్కంద’ ముందుగా దసరాకే అనుకుని ప్రీపోన్ చేసుకున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ‘లియో’ ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుంది ఎవరో కాదు. యువ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ. బాలయ్య తర్వాత సినిమా (NBK 109) ప్రొడ్యూస్ చేస్తుంది కూడా ఆయనే. మరి ‘భగవంత్ కేసరి’ తో రిలీజ్ క్లాష్ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి.
భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది🔥#Bhagavanthkesari Grand Worldwide Release on October 19th, 2023💥#BhagavanthKesariOnOCT19
Natasimham #NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @JungleeMusicSTH @sahugarapati7… pic.twitter.com/2uAeo5wWRH
— Shine Screens (@Shine_Screens) July 22, 2023