గత ఏడాది నవంబర్ లో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అప్పట్లో కైకాల ఆరోగ్యంపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కైకాల కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన.. తను అనారోగ్యంగా ఉన్న సమయంలో సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కి కైకాల సత్యనారాయణ ఓ లేఖ రాశారు.
ఇది చదవండి : అనసూయకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భర్త.. నెట్టింట ఫోటోలు వైరల్!
“బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఫోన్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధ పట్ల నేను చాలా సంతోషిస్తున్నానని. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వారు ఆర్థిక సహాయంతో పాటు ఇతర అన్ని రకాల సహకారాలు అందించారు. ఆ కష్ట సమయం మీ సహాయం నాకు, నా కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది. మీరు చూపిన ఈ శ్రద్ధ కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల మీకు ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది” అని కైకాల లేఖలో పేర్కొన్నారు.
తాను సంతకం చేయలేక పోవడంతో, తన కుమారుడు ఈ లేఖపై సంతకం చేశారని ఆయన వెల్లడించారు. అంతే కాక తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయని ఆయన అన్నారు. కైకాల రాసిన ఈ లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.