కొన్ని రోజులు ఈ కుర్రాడి స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేన మామ పోలికలు వచ్చి చేరాయని ఫ్యూచర్ స్టార్ అని కితాబులందుకున్నాడు. సరిగ్గా ఇలాంటి పోలిక ఒకటి వై.యస్.ఆర్ కుటుంబంలో జరిగింది. వారిద్దరూ ఎవరో కాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, అతని మేనల్లుడు రాజారెడ్డి.
కుటుంబాలు చిన్నాభిన్నమైన ఆ బ్లడ్ లో మ్యాజిక్ మాత్రం అలాగే ఉంటుంది. మనం పెరిగే వాతావరణం బట్టే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అలాగే మన కుటుంబంలోని లక్షణాలే అనుకోకుండా మనకి వచ్చి చేరతాయి. ఈ విషయం ఎవరో చెప్పేదాకా మనకు కూడా తెలియదు. మనుషులు ఎక్కడున్నా వారి మనసులు మాత్రం ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఇటీవలే సుధీర్ బాబు కొడుకు ఒక ఈవెంట్ కి నడుచుకుంటూ వచ్చిన స్వాగ్.. అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబు ని పోలి ఉంది అని అంతా చెప్పుకొచ్చారు. కొన్ని రోజులు ఈ కుర్రాడి స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేన మామ పోలికలు వచ్చి చేరాయని ఫ్యూచర్ స్టార్ అని కితాబులందుకున్నాడు. సరిగ్గా ఇలాంటి పోలిక ఒకటి వై.యస్.ఆర్ కుటుంబంలో జరిగింది. వారిద్దరూ ఎవరో కాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, అతని మేనల్లుడు రాజారెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక వెలుగు వెలిగిన నేతల్లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు. పాలించింది తక్కువ సంవత్సరాలైనప్పటికీ ప్రజల్లో హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆరోగ్య శ్రీ, ఒక్క రూపాయికే బియ్యం వంటి పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. చనిపోయి 14 ఏళ్ళు అయినా ప్రజలు ఇంకా ఈ మహాను భావుడి నామస్మరణ చేయడం ఈయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. 2009 జూలైలో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన రాజశేఖర్ రెడ్డి గారి మరణానికి నేటికీ 14 సంవత్సరాలు. ఈ రోజు వైఎస్సార్ జయంతి సందర్భంగా కుమారుడితో కలిసి.. షర్మిల ఇడుపలపాయకు చేరుకున్నారు. ఆ సమయంలో కెమెరాలు కళ్ళు అంతటా షర్మిల కొడుకు రాజా రెడ్డి వైపుకే వెళ్లాయి.
షర్మిల కుమారుడ్ని చూసిన నెటిజన్స్ చూడడానికి సినిమా హీరోల ఉన్నాడని పొగిడేశారు. స్టార్ హీరో రేంజ్ లో ఇతని కటౌట్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. కండలు తిరిగిన దేహరుఢ్యం, హైట్ చూసి స్టార్ హీరో రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ రోజు షర్మిల కొడుకు రాజా రెడ్డి కూర్చున్న ఒక స్టిల్ అచ్చం జగన్ మోహన్ రెడ్డిని గుర్తు చేసింది. తాత వైఎస్సార్ సమాధి ముందు రెండు చేతులు మోకాలిపై పెట్టి దీనంగా కూర్చున్నాడు రాజా రెడ్డి. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం ప్రత్యక హోదా కోసం పోరాడుతూ జగన్ మోహన్ రెడ్డిగారు గారు కూడా ఇదే తరహాలో కూర్చోవడం విశేషం. ఆనాడు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జగన్ ఈ విధంగా కూర్చున్నారు. ఈ రెండు ఫోటోలను పక్కపక్కన పెట్టి చూస్తే ముచ్చట గొలిపే విధంగా ఉంది. మేనమామ పోలికలు పుణికిపుచ్చుకున్నట్లుగా రాజా రెడ్డి ఒక్కసారిగా జగన్ మోహన్ రెడ్డి గారిని గుర్తు చేశాడు. ప్రస్తుతం మనుషులు వేరుగా ఉన్నా.. ఇలా ఒకే రకమైన ఫోజుతో ఉండడం కొత్తగా అనిపించింది. ఏదేమైనా.. మేనమామకి తగ్గ అల్లుడు వచ్చాడంటూ వైసీపీ శ్రేణులు ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.