జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ పాటిదో అందరికీ తెలిసిందే. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక రాజకీయాల్లోకి వస్తే అదే రేంజ్ లో దున్నేస్తారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం జూనియర్ ఎన్టీఆర్ కి ఉందని పోసాని కృష్ణమురళి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంత క్రేజ్ ఉందో రాజకీయాల్లో కూడా అంతే క్రేజ్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ లా అటు సినిమాలను, ఇటు రాజకీయాలను దున్నేసే కెపాసిటీ జూనియర్ ఎన్టీఆర్ కి ఉందని చాలా మంది నమ్ముతారు. సినిమాల్లో ఎన్టీఆర్ స్టామినా ఏంటో ప్రూవ్ అయ్యింది. ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్ స్టామినా ఏంటి అనేది ప్రూవ్ అవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సత్తా చాటడం ఖాయమని అభిమానుల విశ్వాసం. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకు ఇంకా సమయం ఉందని, ఇది తగిన సమయం కాదని అంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్త అనారోగ్యంగానే ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అలాంటి పార్టీలోకి ఎన్టీఆర్ వస్తే పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు.
మరోవైపు ఏదో ఒకరోజు ఎన్టీఆర్ ఆ పార్టీని హస్తగతం చేసుకుంటారని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ మనసులో ఏముందో గానీ ఎన్టీఆర్ చరిష్మా గురించి పలువురు ప్రముఖులు చెప్తుంటారు. ఎన్టీఆర్ కి సీఎం అయ్యే సత్తా ఉందని ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా పోసాని కృష్ణమురళి ఎన్టీఆర్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కి అనారోగ్యం చేసినప్పుడు ఆమె భార్య చనిపోతే ఆ వయసులో ఆయనను చేసుకోవడానికి లక్ష్మి పార్వతి వివాహం చేసుకున్నారని, అలాంటి ఆవిడను పట్టుకుని ఈ చంద్రబాబు, టీడీపీ వాళ్ళు తిడుతున్నారని మండిపడ్డారు.
హరికృష్ణ రెండో భార్యను, జానియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టే ధైర్యం వీళ్ళకి ఉంటుందా? తిట్టలేరు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోరు. పైగా అతనితో బాబుకి అవసరం ఉంది. నందమూరి తారక రామారావు భార్య గురించి ఎందుకు హీనంగా మాట్లాడావు అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు పోసాని. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అనగలరా? జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ హీరో కాబట్టి భయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఏమీ అనలేకపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి మహాతల్లి అని అంటున్నారు, మరి సీనియర్ ఎన్టీఆర్ భార్య మహాతల్లి కాదా అంటూ ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉంది. వాంటెడ్ పర్సన్. తర్వాత ముఖ్యమంత్రి అవ్వగల కెపాసిటీ ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ అనరు. జూనియర్ ఎన్టీఆర్ తో మంచిగా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లన్నీ తమ పార్టీకే పడతాయని ఏమీ అనడం లేదు అంటూ పోసాని కామెంట్స్ చేశారు. మరి పోసాని చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.