కొత్త కార్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు చాలా మంది పాత కారును అమ్మేసి కొత్త కారును కొనుకుంటారు. ఆ కారు పేరు లంబోర్ఘిని ఉరుస్ ఈ మోడల్ కారును ఆయన బుక్ చేసాడు. మామూలుగా ఎన్టీఆర్‌కి కార్లంటే చాలా ప్యాషన్. ఇప్పుడు ఎంతో ముచ్చటపడి ఈ ఇంపోర్టెడ్ కారుని కొనుగోలు చేశారట. ఇటలీ నుంచి ఈ కారును దిగుమతి అయిన సూపర్ స్పోర్ట్స్ కారు ఖరీదు రూ.5 కోట్ల వరకు ఉంటుందని టాక్. అత్యంత ఖరీదైన లాంబొర్కిని యూరస్ అనే మోడల్ కారును ఎన్టీఆర్ కొన్ని నెలల కిందటే బుక్ చేశాడు. చాలా నెలల అనంతరం అది డెలివరీ అయ్యింది.
జూనియర్ ఎన్టీఆర్ ఖాళీ సమయం దొరికితే ఎక్కువగా ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళుతుంటాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో రామ్ చరణ్ తో క్లోజ్ గా ఉంటున్న తారక్ తరచుగా కలుసుకోవడానికి ఇంటికి వెళుతుంటాడు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి పార్టీలు కూడా చేసుకుంటారు. రీసెంట్ గా ఖరుదైన కొత్త కారును కొనుగోలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇంటికి వెళ్ళాడు. ప్రస్తుతం పార్క్ చేసిన ఉన్న ఆ కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
RRR కంటే ముందే మంచి స్నేహితులుగా ఉన్న రామ్ చరణ్ – ఎన్టీఆర్ ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి మరింత క్లోజ్ అయ్యారు. నార్మల్ ఫ్రెండ్స్ ఎలాగైతే ఉంటారో అలానే కొనసాగుతున్నారు. ఇక కొత్త కారు కొన్న వేళ మొదట రామ్ చరణ్ వద్దకు వెళ్లిన తారక్ అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాడట.
ఎన్టీఆర్ ఈ కొత్త కారును కొనడంపై నిజం లేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ కొత్త కారు అంటూ ఓ ఫోటో మాత్రం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమాలు చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే.