తారకరత్న అకాల మరణం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తాజాగా తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ లోని ఇంటికి తీసుకొచ్చేశారు. ఈ క్రమంలోనే అందరూ నివాళులర్పిస్తున్నారు.
తారకరత్న అకాల మరణం.. నందమూరి ఫ్యామిలీని శోకసంద్రంలో ముంచేసింది. ఇక అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, తెలుగు సినీ ప్రముఖులు.. ఈ నటుడి మృతిపై తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక పార్థివదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేశారు. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులు అందరూ కూడా తారకరత్నని కడసారి చూసేందుకు వస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ మనవడు అయిన తారకరత్న హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. పలు సినిమాలు చేసి పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ నటుడిగా మాత్రం గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ యాక్ట్ చేస్తూ వచ్చాడు. తారకరత్న చివర సినిమా ‘మిస్టర్ తారక్’.. ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది. ఇలా నటుడిగా అప్పుడప్పుడు సినిమాలతో ఎంటర్ టైన్ చేసిన తారకరత్న.. రీసెంట్ గా పాలిటిక్స్ లో కాస్త యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్నాడు. తొలిరోజు కుప్పకూలిపోయాడు.
దీంతో హుటాహుటిన బెంగళూరు తరలించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో అప్పటి నుంచి నిన్నటి వరకు వెంటిలేటర్, ఎక్మోపై ఉంచి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. తాజాగా శివరాత్రి రోజు తారకరత్న శివైక్యం అయిపోయారు. తాజాగా ఆయన్ని హైదరాబాద్ లోని స్వగృహానికి తీసుకురాగా కుటుంబసభ్యులు అందరూ ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఇక తారకరత్న కడసారి చూసేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా తారకరత్నతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ గా మారింది. మరి తారకరత్న మరణంపై మీ సంతాపాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి.