పవన్ కళ్యాణ్ నటించిన హరిహల వీరమల్లు సినిమా ఇప్పుడు ఓటీటీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. సినిమా మిస్ అయిన అభిమానులు ఇక ఓటీటీలో వీక్షించవచ్చు. ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అనేది తెలుసుకుందాం.
జాగర్లమూడి క్రిష్-జ్యోతికృష్ణ తెరకెక్కించిన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్ విడుదలైంది. జూలై 24న ధియేటర్ రిలీజ్ ద్వారా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. అటు కధ, దర్శకత్వం, గ్రాఫిక్స్ అన్నింటిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సెకండ్ హాఫ్ మరింత స్లో అవడంతో సినిమాకు ప్రాణం పోయిందనే టాక్ ఉంది. సినిమా డిజాస్టర్ కావడంతో ఓటీటీలో ఆకట్టుకుంటుందనే ఆశలో అభిమానులు ఉన్నారు.
ముందుగానే ఓటీటీలో…
ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి సెప్టెంబర్ నెలలో ఓటీటీలో విడుదల కావల్సి ఉంది. అయితే అనుకున్న ఒప్పందం కంటే ముందే స్ట్రీమింగ్ చేసేందుకు వీలుగా అమెజాన్ సంస్థకు చిత్ర నిర్మాతలకు ఒప్పందం జరిగింది. ఈ మేరకు అదనంగా మరో 15 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్ధమైంది. కొన్ని సినిమాలు ధియేటర్ రిలీజ్ ఆకట్టుకోకపోయినా ఓటీటీలో హిట్ అవుతుంటాయి. అటు పవన్ ఫ్యాన్స్ ఇటు చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఓటీటీపై ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు ఆగస్టు 15న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అధ్వాన్నంగా ఉండటమే కాకుండా సినిమా కధపై విమర్శల నేపధ్యంలో ఆకట్టుకోలేకపోయింది. అంత బడ్జెట్ పెట్టినా వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌లో నాణ్యత లేకపోవడం సినిమాకు అతి పెద్ద మైనస్. చూడాలి మరి ఓటీటీలో హరిహర వీరమల్లు ఏ మేరకు ఆకట్టుకుంటుందో.