టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్‌తో మొదలైన ఆ కుటుంబం నేడు నాలుగు తరాలకు చేరుకుంది. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలుగా మారి నేడు స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. ప్రతీ మగాడి విజయం వెనుక ఆడవాళ్లు ఉంటారన్నది నానుడి మాట. ఇక మెగా హీరోల వారసుల విజయాల వెనుక కూడా ఆడవాళ్లు ఉండి వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటరా?
అయితే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి చెందిన ఆడవాళ్లు లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఒకే ఫ్రేమ్‌లో నాలుగు తరాల వారు దర్శనమిచ్చారు. ఈ ఫోటోను రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ ఫోటోలో చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖ తో పాటు కోడలు ఉపాసన శ్రీజ కూతురు నివృతి ఉన్నారు. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా అంజనాదేవి, సురేఖ, ఉపాసనలు అలంకరించుకున్నారు.
ఇక శ్రీజ కూతురు నివృతి చీర కట్టుకుని ముద్దులొలుకుతూ పదహారణాల తెలుగమ్మాయిలా దర్శనిమచ్చి అందరిని షాక్‌కు గురయ్యేలా చేసింది. దీంతో చిరంజీవి ఇంట్లో ఏ పండగ జరిగిన మెగా ఫ్యామిలీ ఆడవాళ్లంతా ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారట. తాజాగా ఉపాసన పోస్ట్ చేసిన ఈ పోటో సోషల్ మీడియాలో హల్చచ్ చేస్తోంది.
