ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ప్రమోషన్స్ తో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. మార్చి 25న 14 భాషల్లో పాన్ వరల్డ్ చిత్రంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కరోనా మూడో వేవ్ కు ముందు కోట్లలో ఖర్చుచేసి ఆ తర్వాత చిత్రాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ చిత్ర బృందం ఏ మాత్రం తగ్గకుండా మళ్లీ ప్రమోషన్స్ చేస్తోంది. రాజమౌళి, రామ్ చరణ్, తారక్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మాములుగా అయితే ఎత్తర జెండా పాటను మార్చి 14న సాయంత్రం విడుదల చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: RRR పాటలో హీరోలు పట్టిన జెండా అసలు కథ ఏంటంటే?
అయితే ఆ సమయం దాకా వేచిచూసిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. చెప్పిన సమయానికి ఒక అరగంట ముందు టెక్నికల్ ఇష్యూ వల్ల పాట విడుదలను మార్చి 15 ఉదయం 10 గంటలకు మార్చారు. పాట వాయిదా వేయడంపై ఫ్యాన్స్ ఫుల్ ఫయర్ అవుతున్నారు. ఏపీ సీఎంను కలవడానికి వెళ్లిన సందర్భాన్ని ఉటంకిస్తూ కామెంట్ చేస్తున్నారు. అలా తిరగడానికి మీకు సమయం ఉన్నప్పుడు. పాటను చెప్పిన సమయానికి పాటను విడుదల చేసేందుకు టైం దొరకలేదా? ఆఖరి నిమిషంలో అలా ఎలా వాయిదా వేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో సినిమాను పలుసార్లు వాయిదా వేయడం. ఇప్పుడు ఎత్తర జెండా పాటను కూడా వాయిదా వేయగానే అభిమానుల్లో అసహనం పెళ్లుబికింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
