ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అనే ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ.. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేవారు. అందరినీ ఒక తాటిపై నిలిపేవారు. దాసరి నారాయణరావు మృతి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ తరుణంలో ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే విషయంపై ఆర్ ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి లైన్ లోకి వచ్చి ఏకంగా రామ్ గోపాల్ వర్మ పేరు ప్రస్తావించారు. దీంతో ఆయన చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Good decision boss👏👏
Industry problems clear cheyadaniki vere Batch undi..
Meru happy ga undandi chalu..@KChiruTweets ❤️ pic.twitter.com/35oXzW1wFE— Chaℜan… ッ (@SScharanalwayzz) January 2, 2022
మొదటి నుంచి ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవినే భర్తీ చేయగలరు అంటూ ఎందరో తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. కానీ ఇటీవల సినీ పెద్దరికంపై చిరంజీవి రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ అయింది. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద అనే హోదా తనకు అవసరం లేదని, కానీ అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటానని మెగాస్టార్ అన్నారు.
మా బాస్ ( రాంగోపాల్ వర్మ ) ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గా చూడాలని నా కోరిక…
సామీ మీరు రావాలి సామీ 🥳😎#ఇండస్ట్రీపెద్ద @RGVzoomin pic.twitter.com/0Y3Nnf0w48
— Ajay Bhupathi (@DirAjayBhupathi) January 2, 2022
దీంతో ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే విషయం మళ్లీ హాట్ టాపిక్ కావడంతో.. రామ్ గోపాల్ వర్మ పేరును డైరెక్టర్ అజయ్ భూపతి ప్రస్తావించారు. ”మా బాస్ రాంగోపాల్ వర్మని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక. సామీ మీరు రావాలి సామీ” అని పేర్కొంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వర్మతో పాటు అజయ్ భూపతిని కూడా ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఆర్జీవీ తెరకెక్కించిన “వంగవీటి” సినిమాకు అజయ్ భూపతి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇండస్ట్రీ పెద్దగా వర్మ పేరు అజయ్ భూపతి ప్రస్తావించడపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వద్దు సామీ.. తనకోసం మాత్రమే బ్రతికే… వాడెవడూ అందరికీ ఉపయోగపడలేడు సామీ 🙏🙏 ఆ లిస్ట్ లో మొదటి వరుసలో వుండే అత్యంత స్వార్థపరుడు మీ గురువుగారు 😃😃
— 𝙳𝚑𝚊𝚗𝚞 𝙽 𝙹𝚘𝚢 ™ (@IamRDN_) January 2, 2022
సినిమా ఇండస్ట్రీకి రామ్ గోపాల్ వర్మ గారు మైండ్ ఎప్పుడూ నెగిటివ్ గా ఉంటుంది అలా ఉంటే కష్టం ఎప్పుడు పాజిటివ్ మైండ్ ఉండాలి అందర్నీ కలుపుకుపోయే గుణం కలిగి ఉండాలి అప్పుడే ఇండస్ట్రీ పెద్దదిక్కు కాగలరు.
— 🌟Nagaraju 786🌟 (@Nagaraju0786) January 3, 2022
ఓర్నీ.. ఇన్నిరోజులు ఈ ఆలోచనే రాలేదు చ.. 🤙🤙🙄
— Haris రైతు 🌾 (@SoldierHaris) January 2, 2022