తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రం పెద్దగా పేరు తెచ్చుకోకపోయినా.. రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ వరుస హిట్స్ తో దూసుకు పోయాడు. రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇవాళ రామ్ చరణ్ 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.
రామ్ చరణ్ పుట్టిర రోజు సందర్భంగా సెలబ్రెటీలు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు ఎన్నో వెరైటీలుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెర్రీ చిన్ననాటి ఫోటో షేర్ చేశాడు. ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తూనే తండ్రి చిరంజీవి కోసం నిర్మాతగాను మారాడు. ఈ చిత్రంలో తండ్రీ కొడుకు కలిసి నటిస్తున్నాు.. ఏప్రిల్ 29న విడుదల కానుంది.
రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.
అయితే ఈ occasion లో @AlwaysRamCharan పిక్ ఒకటి
షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan pic.twitter.com/asyDUDoP6H— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2022