సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఇంకా పూర్తిగా కోలుకోకముందే ఆయన అప్‌కమింగ్ మూవీ రిలీజ్‌కు రెడీ అయింది. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ట్రైలర్ బుధవారం మెగాస్టార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేజ్ ఇంకా కోలుకోకముందే సినిమా రిలీజ్‌కు ఏర్పాట్ల పై స్పందించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉందని దానికంటే ఒక రోజు ముందు సినిమా విడుదలచేస్తే బాగుంటుందని, ఆ సమయానికి ఇది పరఫెక్ట్ సినిమా అని తేజ్‌నే చెప్పాడని, అతని కోరిక మేరకే సినిమాను అక్టోబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. సినిమా బాగా ఆడాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.