మెగాస్టార్ చిరంజీవి.. ఈయన మాట ఒక ప్రభంజనం. చిరు నోటి నుండి ఒక మాట బయటకి వస్తే.. దానికి ఉండే విలువ వేరు. అంతటి స్థాయి ఉంది కాబట్టే చిరు ఏమి మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతూ, అందరివాడు అనిపించుకుంటూ ఉంటారు. ఇక చిరంజీవి రాజకీయాలకి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి చకచకా షూటింగ్స్ పూర్తిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్ నోటి నుండి వచ్చిన ఒక చిన్నమాట తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. తన సినిమాలకి సంబధించిన అంశాలను మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్న మంచి, చెడులను కూడా ఆయన అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిరు తాజాగా ఓ డైలాగ్ తో ట్వీట్ చేశారు.
“నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను. కానీ.. నా నుండి ఇంకా రాజకీయం దూరం కాలేదు” అన్న డైలాగ్ ఆ ఆడియో ట్వీట్ లో ఉంది. దీంతో.. ఈ డైలాగ్ విన్న ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. చిరంజీవి నుండి ఈ డైలాగ్ వచ్చింది నిజంగా రాజకీయాలను టార్గెట్ చేసేనా? పొలిటికల్ ఫీల్డ్ లోకి ఆయన రీఎంట్రీ ఉండబోతుందా? అన్న చర్చ గట్టిగానే నడుస్తోంది. మరోవైపు ఇది ఆయన అప్ కమింగ్ మూవీ ‘గాడ్ ఫాదర్’లోది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా చిరు నుండి ఇలాంటి ట్వీట్ రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎంతైనా బాస్ రేంజ్ ఇది అంటూ మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022