పవన్ ఫ్యాన్స్ అంతా ‘భీమ్లానాయక్’ మేనియాలోనే ఉన్నారు. బ్లాక్ బస్టర్ టాక్ తో ఈ సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ గా రూ.165.53 కోట్ల గ్రాస్ రూ.92.5 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. చాలా గ్యాప్ తర్వాత పవన్.. ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చాడు. భీమ్లానాయక్ హిందీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హిందీ వర్షన్ లోనూ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో పవన్ మేనియా హిందీలోనూ మొదలౌతుందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
తాజాగా భీమ్లానాయక్ సినిమా యూనిట్ క్రేజీ అప్డేట్ తో వచ్చేసింది. అప్పుడే భీమ్లానాయక్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. మార్చి చివరి వారంలోనే ఆహాలో భీమ్లానాయక్ సందడి చేస్తాడని తెలుస్తోంది. పవన్- రానా బైక్ పై ప్రయాణించే సన్నివేశం, అంత ఇష్టమేందయా సాంగ్ రెండూ సినిమాలో లేవని ఫ్యాన్స్ నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఓటీటీ రిలీజ్ లో అవి కూడా ఉండబోతున్నారయనే టాక్ వినిపిస్తోంది. అంటే పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.