పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్, అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నా, పెద్ద, ముసలి,ముతక, యువత, మహిళలు.. ఇలా ప్రతి వర్గం నుంచి ఆయనకు అభిమానులు భారీగా ఉన్నారు. ఇక పవర్ స్టార్ అభిమానుల్లో బండ్ల గణేష్ ముందు వరుసలో ఉంటారు. నటుడి నుంచి నిర్మాతగా ఎదిగాడు బండ్ల గణేష్. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ సినిమా చేసి.. భారీ విజయాన్ని అందుకున్న బండ్ల.. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు కానీ.. ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయకూడదని అనుకుంటున్నానంటూ బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశాడు. అసలేం జరిగింది. ఆయన ఎందుకలా మాట్లాడారనే వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: ‘ఆచార్య’లో రామ్ చరణ్ బదులు పవన్ కళ్యాణ్.. చిరు ఏమన్నాడంటే!
‘‘పవన్ కళ్యాణ్‌గారు ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు నాలుగైదు సినిమాలు కమిట్ అయ్యారు. వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. వాటిని పూర్తి చేసుకుని నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను. అంతేతప్ప దర్శకుడితో గొడవలు అయ్యి సినిమా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. నేను నాగార్జున సాగర్‌లాంటోడిని. నీళ్లు వస్తుంటాయి.. పోతుంటాయి. అన్ని నీళ్లు నావే అని అనుకోకూడదు. మిగతావాళ్లందరూ ఆ టైపే. భవిష్యత్తులో వంద శాతం సినిమాలు తీస్తాను. సినిమానే నాకిష్టం, సినిమానే నా ప్రాణం. సినిమాలే నా ఎమోషన్ కాబట్టి సినిమాలు తీస్తా.. తీస్తా. పవన్ కళ్యాణ్‌గారితో సినిమా చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన త్వరగా ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఇది కూడా చదవండి: Nagababu: పవన్ కంటే జగన్ రేంజ్ ఎక్కువని ఒప్పుకున్న నాగబాబు!‘మరి పవన్ సీఎం అయ్యాక మీకు ఎమ్మెల్సీ ఇస్తే తీసుకుంటారా.. ఆయన అలా ఇస్తే మీరు మినిష్టర్ కూడా అవుతారు కదా!’ అని అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ స్పందిస్తూ.. ‘‘నాకు ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, ఎంపీలు వద్దు సార్. వార్డు మెంబర్‌గా జనం దయతో గెలిస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం నేను రాజకీయం అనే పడవలో లేను. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాను. అలాగే బొత్స సత్యనారాయణగారి గురించి, పవన్ కళ్యాణ్‌గారి గురించి నన్ను అడగకండి. ఎందుకంటే వారంటే నాకు ప్రేమ. నా ఫ్యామిలీని ప్రేమించినట్లే వారిని ప్రేమిస్తాను’’ అని తెలిపాడు బండ్ల గణేష్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి. మరి బండ్ల గణేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆ ఫోటో విషయంలో పవన్ ఫ్యాన్స్ కి సమాధానం ఇచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్!