ఆర్ఆర్ఆర్.. గతేడాది నుండి ప్రపంచాన్ని ఊపేస్తూ.. ఎట్టకేలకు ఆస్కార్ కలను నెరవేర్చుకుంది. తెలుగు సినిమాకి ఆస్కార్ కలను నెరవేర్చింది. ఆర్ఆర్ఆర్ లోని 'నాటు నాటు' సాంగ్.. 95వ ఆస్కార్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అవార్డు అందుకుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా విష్ చేశాడు.
ఆర్ఆర్ఆర్.. గతేడాది నుండి ప్రపంచాన్ని ఊపేస్తూ.. ఎట్టకేలకు ఆస్కార్ కలను నెరవేర్చుకుంది. తెలుగు సినిమాకి ఆస్కార్ కలను నెరవేర్చింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. కాగా.. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ సాంగ్.. 95వ ఆస్కార్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అవార్డు అందుకుంది. దీంతో ఒక్కసారిగా వరల్డ్ వైడ్ నాటు నాటు బీట్స్ నాటుకుపోయాయి. ఆస్కార్ గెలుపుతో అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఫ్యాన్స్, విదేశీ సెలబ్రిటీలు సైతం తెలుగు సినిమాని కొనియాడుతూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా విష్ చేశాడు. “ఆస్కార్ గెలుపు. యావత్ దేశానికి గ్రేట్ మూమెంట్.. ఆస్కార్ వేదికను ఓ తెలుగు పాట ఊపు ఊపినందుకు చాలా గర్వంగా ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, బ్రదర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు శుభాకాంక్షలు. అలాగే గ్లోబల్ స్టార్స్.. నా లవ్లీ బ్రదర్ రామ్ చరణ్, తెలుగు ప్రైడ్ తారక్.. మీ నాటు నాటు స్టెప్పులతో వరల్డ్ మొత్తాన్ని షేక్ చేశారు. ఈ మ్యాజిక్ అంతటికీ కారణమైన డైరెక్టర్ రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇది ఖచ్చితంగా ఇండియన్ సినిమాకి హార్ట్ టచింగ్ మూమెంట్.” అని బన్నీ ట్వీట్ లో విష్ చేశాడు.
ఒకరోజు లేటుగా అయినాసరే స్పందించి.. విష్ చేసినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం.. తన గ్లోబల్ రేంజ్ క్రేజ్ తెచ్చిన పుష్.. సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ‘పుష్ప 2’ రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ RC15తో.. ఎన్టీఆర్ కొరటాల సినిమాతో బిజీగా ఉన్నారు. మరి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విజయంపై, అల్లు అర్జున్ రెస్పాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Big moment for INDIA 🇮🇳.
Elated to see a Telugu song shaking at the Oscars . Biggest Congratulations to @mmkeeravaani garu , @boselyricist garu , @premrakchoreo master , brothers @Rahulsipligunj , @kaalabhairava7 , my beloved global stars , my lovely brother @AlwaysRamCharan— Allu Arjun (@alluarjun) March 14, 2023