అల్లు అర్జున్ స్వాగ్, అట్లీ మార్క్ ఎలివేషన్స్ కలిస్తే థియేటర్లలో సీట్లు చినగాల్సిందే అనే రేంజ్‌లో ఈ సినిమా యాక్షన్ బ్లాక్స్ ఉండబోతున్నాయట. పుష్ప తో తగ్గేదేలే అన్న బన్నీ, ఈసారి ‘రాకా’తో అస్సలు వదిలేదేలే అంటున్నట్లు టాక్.. ఆ క్రేజీ లీక్ ఏంటంటే? ఫిలింనగర్ సర్కిల్స్ ప్రకారం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా పవర్‌ఫుల్‌గా, కాస్త నెగెటివ్ షేడ్స్‌తో కూడిన కిల్లర్ లుక్‌లో ఉండబోతోందట. సోషల్ మీడియాలో ఈ లీక్ చూసి ఫ్యాన్స్ ఇప్పుడే థియేటర్లలో పేపర్లు చించేయడానికి రెడీ అయిపోతున్నారు.
అట్లీ సినిమాల్లో మ్యూజిక్ గ్రాండ్ గా ఉంటుంది, ఇక బన్నీ డ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సాంగ్స్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేయడం ఖాయం. సరిగ్గా చెప్పాలంటే, ‘రాకా’ అనేది కేవలం సినిమా కాదు, బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ అండ్ అట్లీ కలిసి చేయబోయే ఒక పెద్ద విధ్వంసం

దర్శకుడు అట్లీ ఈ సినిమా కోసం బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ బ్యూటీలను రంగంలోకి దించుతున్నాడనే టాక్ నడుస్తోంది. దీపికా పదుకోన్ ఈమె ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఒక పురాణ కాలం నాటి నేపథ్యంలో సాగే గర్భిణీ స్త్రీ పాత్రలో దీపికా కనిపించబోతోందట. సినిమా ఇంటెన్స్ ఎమోషనల్ డ్రైవ్‌కు ఈ క్యారెక్టరే ప్రాణం అని ఇండస్ట్రీ టాక్.
రష్మిక మందన్నా ‘పుష్ప’లో శ్రీవల్లిగా బన్నీతో రొమాన్స్ చేసిన రష్మిక.. ఈసారి రూట్ మార్చింది. దీపికా క్యారెక్టర్‌ను కాపాడే ఒక శక్తివంతమైన రక్షకురాలి పాత్రలో ఆమె కనిపిస్తుందని టాక్.. కానీ అంతకంటే క్రేజీ రూమర్ ఏంటంటే.. రష్మిక ఈ సినిమాలో మెయిన్ విలన్ సూపర్ విలన్ గా మారిపోయి బన్నీతోనే ఢీకొట్టబోతోందట ఇక జాన్వీ కపూర్ రాకా ప్రపంచంలో ఒక పవర్‌ఫుల్ గిరిజన రాణి లాంటి ఫెరోషియస్ క్యారెక్టర్‌లో మెరవబోతోందట. మృణాల్ ఠాకూర్ ఈమె కూడా ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తోందని సమాచారం
