ఎన్నికలొస్తే చాలు… నాయకులంతా ప్రచార రథంపై ఎక్కి, జనాన్ని చూసి చేతులు ఊపుకుంటూ వెళ్లడం మనం ఎప్పుడూ చూసేదే! కానీ, తమిళనాడు మాత్రం సీఎం విజయ్ విజనే వేరూ..నేను ట్రెండ్ ఫాలో కానూ..ట్రెండ్ సెట్ చేస్తానంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు..ప్రచారరథంపై అభ్యర్ధిని ఉంచి తానే స్వయంగా నడుచుకుంటూ ప్రజల వద్దకు వెళ్తూ తమ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.. విజయ్ చేసి ఈ ప్రచారం దేశరాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది…
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘తమిళగ వెట్రి కజగం పార్టీ, ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ గురించే చర్చ. తిరుప్పూర్ జిల్లా ధరాపురం నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని హీట్ పెంచింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూరు చేరుకున్న విజయ్, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా ధరాపురం చేరుకున్నారు. ధరాపురంలో నిర్వహించిన భారీ రోడ్‌షో అచ్చం సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. ఒంటి గంటకు ప్రారంభమైన ఈ ప్రచారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. అయితే, ఇక్కడ ప్రజలను విస్మయానికి గురిచేసిన అసలు విషయం మరొకటి ఉంది. సాధారణంగా ఏ ముఖ్యమంత్రో, అగ్రనేతో ప్రచారానికి వస్తే లగ్జరీ వాహనంపై నిలబడి అభివాదం చేస్తారు. కానీ విజయ్ మాత్రం అందరిలా చేయలేదు! టీవీకే అభ్యర్థిగా బరిలో నిలిచిన సోదరి సత్యభామను ప్రచార రథం పై కూర్చోబెట్టిన విజయ్… తాను మాత్రం ఆ వాహనానికి ముందు వైపుగా నడిరోడ్డుపై కాలినడకన నడుచుకుంటూ వెళ్లారు! కొద్దిసేపు ఎడ్లబండిపై ప్రయాణిస్తూ, మరెంతో దూరం కార్యకర్తలతో కలిసి కాలిబాటనే ప్రజల మధ్యలోకి వెళ్లారు..

దేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, తాను సురక్షితమైన ప్రచార రథంపై కూర్చోకుండా… తాను నడుస్తూ, అభ్యర్థిని రథంపై ఉంచి ఓట్లు అభ్యర్థించడం ఇదే తొలిసారి! ఈ అరుదైన దృశకాన్ని చూసిన స్థానిక ప్రజలు, అభిమానులు ఆశ్చర్యపోయారు. “సీఎం సీట్లో కూర్చున్నా ప్రజల మనిషిలా మారిన విజయ్ నిజమైన నాయకుడు” అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఒక్క మూవ్‌తో విజయ్ రాజకీయ విజన్ ఏంటో మరోసారి నిరూపితమైంది. ఇక ఈ రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన విజయ్, ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ అభ్యర్థి సత్యభామపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.”మన సోదరి సత్యభామపై స్టాలిన్ చాలా నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను తిప్పికొడుతూ సోదరి సత్యభామను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
