ఇండస్ట్రీలో ఒక సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. కానీ, సైలెంట్‌గా వచ్చి.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ.. బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ సినిమా గురించే మనం మాట్లాడుకోబోతున్నాం! తొలినుంచే సోషల్ మీడియాలో, ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒకటే పేరు మారుమోగిపోతోంది.. అదే ‘రియాలిటీ’! ఏంటి.. పేరు వింటేనే ఏదో కొత్తగా ఉందే అనుకుంటున్నారా? అవును ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక అదిరిపోయే, అప్డేట్ ఇచ్చేసారు!”

ఈ సినిమాలో ఉన్న కాస్టింగ్ చూస్తేనే థియేటర్లలో సీట్లు చిరిగిపోవడం ఖాయం అనిపిస్తోంది. ఒకరా.. ఇద్దరా.. టాలెంట్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సీనియర్ యాక్టర్స్ అంతా ఈ ‘రియాలిటీ’ లోకి దిగిపోయారు! ఫస్ట్.. సుప్రీమ్ స్టార్, ఎవర్ గ్రీన్ హంక్ శరత్ కుమార్! ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఆ గంభీరత్వమే వేరు. ఇక డైలాగ్ కింగ్, వాయిస్ పవర్‌హౌస్ సాయి కుమార్! వీరితో పాటు వెర్సటైల్ యాక్ట్రెస్ రోహిణి గారు, మనందరి ఫేవరెట్ అన్నపూర్ణమ్మ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అన్నపూర్ణమ్మ గారు ఉన్నారంటే చాలు.. అటు ఎమోషన్, ఇటు పక్కా లోకల్ కామెడీ రెండు నెక్స్ట్ లెవెల్‌లో పండుతాయి. వీళ్లంతా కలిసి స్క్రీన్‌ని ఏ రేంజ్‌లో షేక్ చేయబోతున్నారో ఊహించుకుంటేనే పూనకాలు వచ్చేస్తున్నాయి!”
ఇక ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచడానికి, కుర్రాళ్ళ గుండెల్లో గంటలు కొట్టించడానికి కథానాయికగా వస్తోంది బ్యూటిఫుల్ దేవికా భట్! ఈ బ్యూటీ తన యాక్టింగ్ అండ్ గ్లామర్‌తో స్క్రీన్‌ని మెరిపించబోతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్, థియేటర్లను షేక్ చేసే మ్యూజిక్ ఇవ్వడానికి ఎవరున్నారో తెలుసా? ప్రెసెంట్ మాస్ పల్స్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్.. జాతర పాటల జమీందార్.. మన భీమ్స్ సిసిరోలియో! భీమ్స్ అన్న మ్యూజిక్ ఇస్తున్నాడంటే.. థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవాల్సిందే, బేస్ అదిరిపోవాల్సిందే! ఆ కమర్షియల్ బీట్స్, ఆ మాస్ సాంగ్స్ వింటే థియేటర్ సీట్లలో కూర్చోవడం ఎవరి తరం కాదు, అందరూ స్టెప్పులు వేయాల్సిందే!”
