ఇండస్ట్రీలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కెరీర్ సాగించిన హీరోయిన్లు.. పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా మ్యారేజ్ లైఫ్ లో చాలామంది హీరోయిన్స్ ఇబ్బందులు ఎదుర్కోవడం, పిల్లలు పుట్టాక భర్తతో విడిపోవడం, పిల్లలతో సపరేట్ గా ఉంటూ లైఫ్ ని నెట్టుకురావడం చూస్తూనే ఉన్నాం. ఈ జాబితాలోకి అలనాటి అందాలనటి రజనీ చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముగ్గురు పిల్లలతో వేరుగా ఉంటున్న రజనీ లైఫ్ కి సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు రజనీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రజనీ అసలు పేరు శశి కౌర్ మల్హోత్రా. అయితే.. బెంగుళూరులో పుట్టి పెరిగిన రజని.. 1985లో బ్రహ్మముడి సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. కెరీర్ లో దాదాపు 150కి పైగా సినిమాలలో నటించిన రజని.. హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు తెలుగులోనే చేయడం విశేషం. రెండు రెళ్ళ ఆరు, సీతారామ కళ్యాణం, అహ నా పెళ్ళంట, మజ్ను లాంటి సూపర్ హిట్ సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది రజని.
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంతకాలానికే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న రజని.. పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలతో పాటు ఎన్నో గ్లామరస్ రోల్స్ చేశారు. అయితే.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకున్న రజని.. 1998లో డాక్టర్ ముల్లగిరి ప్రవీణ్ ని పెళ్లాడింది. వీరికి ముగ్గురు పిల్లలు.. కాగా ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. ఇక పెళ్లై పిల్లలు పుట్టినప్పటి నుండి మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు రావడంతో.. పదేళ్లకే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో వేరుగా ఉంటోంది రజని.
ఇదిలా ఉండగా.. పెళ్లి తర్వాత అప్పటివరకూ హీరోయిన్ గా తాను సంపాదించిన మొత్తాన్ని భర్త చేతిలో పెట్టిందట రజని. అలాగే తన పేరు మీద ఏమి ఉంచుకోకుండా ముంబైలో కొనుక్కున్న అపార్ట్మెంట్ సైతం భర్త, అత్త పేర్ల మీదే రాసిందట. అయినాసరే భర్త, అత్త ఇద్దరూ అదనపు కట్నం కోసం వేధించి.. ఈమెను వదిలించుకోవాలని తప్పుడు కేసులు కూడా బనాయించినట్లు తెలుస్తుంది. అందుకే రజని కూడా ఈ విషయంలో కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అయితే.. ప్రస్తుతం రజని తనకు రావాల్సిన ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇక పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవారు అయిపోయారట. వాళ్లకు ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఇష్టమైన రంగంలో రాణించాలని చెప్పినట్లు రజని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అలా పెళ్లి వరకూ గ్లామరస్ హీరోయిన్ గా నాలుగు భాషల్లో వెలిగిన రజని.. పెళ్లి తర్వాత భర్త నుండి వేధింపులే మిగిలాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రజని లైఫ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.