2022 ఏడాది ముంగిపు దశకు చేరుకుంది. కొన్ని రోజుల్లోనే కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా అందరూ అసలు ఈ ఏడాది మొత్తం ఏం జరిగింది.. ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప విషయాలు ఏంటి? రాజకీయంగా, సినిమాపరంగా, దేశవ్యాప్తంగా ఏం జరిగింది అని వెతుకులాట మొదలు పెట్టారు. వాటిలో ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించే ఎక్కువ అంశాలు ఉంటున్నాయి. అందుకే అసలు 2022లో ఏఏ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు? వాళ్లు ఎవరిని పెళ్లాడారు? అనే అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
డిసెంబర్ 4న హీరోయిన హన్సిక- ఆమె ప్రియుడు సోహెల్ కతౌరియాని వివాహం చేసుకుంది. జైపూర్ కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు మాత్రమే కాదు.. బిజినెస్ పార్టనర్స్ కూడా. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గాయం చేసిన ఈ అమ్మడు.. వివాహంతో మరోసారి కుర్రాళ్ల హృదయాలకు గాయం చేసింది.
తన పెళ్లి వార్తలతో నాగశౌర్య తెలుగు అమ్మాయిలను ఎంతో బాధపెట్టాడు. సడెన్ గా పెళ్లి శుభలేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నాగశౌర్య ఫ్యాన్స్ కి షాకిచ్చాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనుషా శెట్టిని నాగశౌర్య నవంబర్ 21న అంగరంగ వైభవంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారంటూ టాక్ కూడా వచ్చింది.
ఈ ప్రేమికులు జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహానికి అతిరథమహారథులు అంతా హాజరయ్యారు. లేడీ సూపర్ స్టార్ పెళ్లిలో సూపర్ స్టార్ రజినీకాంత్, షారుక్ ఖాన్ సందడి చేశారు. వీరి వివాహాన్ని నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా ప్రెజెంట్ చేయనుంది. అయితే వీరి వివాహం ఆరేళ్ల క్రితమే అయినట్లు సర్టిఫికెట్ తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. పిల్లల సరోగసీ విషయంలో వీళ్లు తమకు గతంలోనే పెళ్లైనట్లు సర్టిఫికెట్ సమర్పించారు.
మే 18న చెన్నైలో ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు, బధుమిత్రులు వీరిని ఆశీర్వదించారు. ఆది పినిశెట్టి లాగే.. నిక్కీ గల్రానీ కూడా మంచి నటి. మలయాళం, తమిళ చిత్రాల్లో మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. అలాగే తెలుగు సినిమాల్లో కూడా అడపాదడపా కనిపించి మెప్పించింది.
ఇంక బాలీవుడ్ లోనూ చాలామంది సెలబ్రిటీలు 2022లో వివాహం చేసుకున్నారు. వారిలో ఆలియా భట్- రణబీర్ కపూర్ ల వివాహం బాగా వైరల్ అయ్యింది. ఏప్రిల్ 14న మూడుముళ్ల బంధంతో వీరు ఒక్కటయ్యారు. వీరికి నవంబర్ నెలలో పాప కూడా పుట్టింది. ఈ బిడ్డ విషయం కూడా బాగా వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో ఫరాన్ అక్తర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తనదైనశైలిలో సినిమాల్లో ఫరాన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న తన చిరకాల ప్రేయసి శివాని దండేకర్ ను వివాహం చేసుకున్నాడు. ముంబైలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
అలీ ఫజల్ అనేకంటే.. గుడ్డూ భాయ్ అంటే అందరికీ బాగా తెలుస్తుంది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా గుడ్డు భాయ్ గా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. అలీ ఫజల్ సెప్టెంబర్ నెలలో తన ప్రేయసి రిచా చద్దాను వివాహం చేసుకున్నాడు.
విక్రాంత్ మస్సే- శీతల్ ఠాకూర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న వారి వివాహ బంధాన్ని తెలియజేస్తూ అట్టహాసంగా కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఏడేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత వీళ్లు వివాహం చేసుకున్నారు.
నాగిని, బ్రహ్మాస్త్ర సినిమాలతో మౌనీరాయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈమె దుబాయ్ లో చెందిన ఎంటర్ పెన్యూర్ గా ఉన్న సురాజ్ నంబియార్ ని ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.
నటుడు అన్షుమన్ ఝాకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో అమెరికాకు చెందిన తన ప్రియురాలు సియెర్రాని వివాహం చేసుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, అభిమానులు కలిగిన సెలబ్రిటీలు జెన్నీఫర్ లోపెజ్- బెన్ అఫ్లెక్ లు ఈ ఏడాది జులై నెలలో లాస్ వేగాస్ లో వివాహం చేసుకున్నారు.