OTT Movies: ఈ మధ్య థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా విడుదలైన నాలుగైదు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఈ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం తగ్గించేశారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటిటి సంస్థలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, ఆహా, వూట్, సోనీ లివ్, జీ5 లాంటివి.. రిలీజ్ కి రెడీగా ఉన్న చిన్న, పెద్ద సినిమాల హక్కులను దక్కించుకొని రిలీజ్ చేసేందుకు పోటీపడుతున్నాయి. అయితే.. ఒక వారంలో పదికి పైగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవ్వడం చూశాం. కానీ జూన్ 17న ఒకేసారి 17 సినిమాలు/వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతుండటం హాట్ టాపిక్ గా మారింది. అందులో తెలుగుతో పాటు ఇతర భాషల డబ్బింగ్ సినిమాలు తెలుగులో అందుబాటులోకి రానున్నాయి.
మరి జూన్ 17న రిలీజ్ కానున్న 17 సినిమాలు/వెబ్ సిరీస్ లు ఏవేవో చూద్దామా!
అమెజాన్ ప్రైమ్ వీడియో:
సుజల్(హిందీ-సిరీస్ 1), ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టి(ఇంగ్లీష్-సిరీస్ 1)
నెట్ ఫ్లిక్స్:
షి(She) సిరీస్ 2, స్పైడర్ హెడ్(మూవీ, ఇంగ్లీష్), యూ డోంట్ నో మీ(ఇంగ్లీష్-సిరీస్ 1), ది వార్ నెక్స్ట్ డోర్(మెక్సికన్-సిరీస్ 1), రెయిన్ బో హై(ఇంగ్లీష్-సిరీస్ 2), ది మార్తా మిట్చెల్ ఎఫెక్ట్(ఇంగ్లీష్-డాక్యుమెంటరీ),
జీ5(Zee5):
రెక్కే(తెలుగు-సిరీస్ 1), ఫింగర్ టిప్(తమిళం-సిరీస్ 2), ధర్మవీర్(మరాఠీ-మూవీ), ముఖాముఖీ(బెంగాలీ-మూవీ), సాస్ మేరీ నే ముండా జమేయా(పంజాబీ-మూవీ)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
మాసూమ్(హిందీ-సిరీస్ 1), O2(ఆక్సిజెన్)-(తమిళం-మూవీ)
ఆహా:
అమ్ముచ్చి 2(తమిళం-సిరీస్ 2)
హోయ్ చోయ్(Hoichoi):
ఫెలూదార్ గోయెందగిరి(బెంగాలీ-సిరీస్ 1)
మరి ఒకేరోజు ఇన్ని సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతుండటం అనేది మామూలు విషయం కాదు. ఓటిటి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఈ ఓటిటి సినిమాలు/సిరీస్ ల ద్వారా లభించనుంది. అలాగే ప్రముఖ ఓటిటి సంస్థలన్నీ సినిమాలు/సిరీస్ ల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న ఓటిటి రిలీజ్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.