ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక, ప్రాణ నష్టాన్ని కలిగించింది. దీనిక ప్రభావం వల్ల ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం ఉద్యోగస్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగస్తులను తొలగించేస్తున్నాయి.
రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదేలు చేసింది. లక్షల్లో ప్రాణాలు పోవడమే కాదు.. ఆర్ధిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయ్యింది. ముఖ్యంగా కరోనా ప్రభావం ప్రైవేట్ ఉద్యోగులపై భారీగా చూపించింది. కరోనా తర్వాత వేలమంది తమ ఉద్యోగాలు కోల్పోయి ఇంటికే పరిమితం అయ్యారు. ఆర్థిక మాంద్యం ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల పరిస్తితి మరీ దారుణంగా మారిందనే చెప్పొచ్చు. దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలా ఒకటేమిటి బడా కంపెనీలు మొత్తం ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఒక్క మెయిల్ పంపి క్షణాల్లో సెటిల్ మెంట్స్ చేసి వేలాది ఉద్యోగులను ఇంటికి పంపించివేస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్ వల్ల తమ వార్షిక లక్ష్యాలను అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని.. అందుకే ఉద్యోగస్తుల సంఖ్య కొంతవరకు పరిమితం చేయడమే తమకు పరిష్కార మార్గంగా కనిపిస్తుంది పలు కంపెనీలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం ముంచుకు వస్తున్న వేళ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ప్రభావం భారత్ లోనూ ఉండొచ్చు అన్న అభిప్రాయాలు ఉద్యోగస్తులను వెంటాడుతున్నాయి. దీంతో బడా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్లో భయాందోళన మొదలయ్యాయి.. ఎప్పుడు తమ ఉద్యోగాలకు ఉధ్వాసన పలుకుతారో అని కంగారులో ఉన్నారు. ఇటీవల జరిగిన ఓ సర్వే దేశంలోని ఉద్యోగస్తులకు శుభవార్త తెలిపింది. ఈ ఏడాది 10.3 శాతానికి పైగా జీతాలు పెరుగుతాయని తెలిపింది.
కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థలతో పాటు సాధారణ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం ప్రభావంతో వేల సంఖ్యల్లో ఉద్యోగస్తులను తొలగించి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాపిల్, అమెజాన్, గూగుల్ సహా ఎన్నో కంపెనీలు తమ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్స్, జూనియర్స్ అనే తేడాలేకుండా ఉద్యోగులకు ఉధ్వాసన పలుకుతున్నాయి. మరికొన్ని కంపెనీలు జీతీలు తగ్గించి వేస్తున్నాయి. ఈ ప్రభావం భారతీయులపై కూడా పడిందని.. స్వదేశాల్లో, విదేశాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే బ్రిటన్ కు చెందిన ఎలోన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వారు ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉద్యోగస్తులకు ఓ మంచి శుభవార్త తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి అడుగుపెడుతున్న వేళ.. భారత్ లో మాత్రం ఆ ప్రభావం ఎక్కువగా చూపించబోదని చెబుతుంది. అంతేకాదు భారత్ లో ఈ ఏడాది ఉద్యోగులకు 10.3 శాతం జీతాలు పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇటీవల ఎలోన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 28వ భారత వార్షిక వేతన పెంపు సర్వే జరిపినపుడు పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ సంస్థ దాదాపు పద్నాలు వందల కంపెనీల్లో సర్వీ నిర్వమించింది. ఇతర దేశాలతో పోలిస్తే ఈ ఏడాది భారత్ లో జీతాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మంచి పర్ఫామెన్స్ చేసే ఉద్యోగులకు జీతాలు భారీగా పెరుగుతాయని తెలిపింది. కింది స్థాయి ఉద్యోగులతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది.