క్రికెట్లో గొప్ప కెప్టెన్లుగా పేరు గడించిన వారు చాలా మందే ఉన్నారు. అయితే వారి నుంచి ఎంఎస్ ధోనీని ఒక క్వాలిటీ మాత్రం వేరు చేస్తోంది. అదేంటంటే..!
ప్రపంచ క్రికెట్లో ఎందరో కెప్టెన్లను చూసుంటారు. క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్ నుంచి రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ వరకు చాలా మంది సారథులు తమ జట్లను అత్యుత్తమంగా నడిపించారు. వరల్డ్ కప్స్‌తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక ట్రోఫీలను టీమ్స్ అందించి క్రికెట్ అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అయితే బెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు మాత్రం ఒకరి పేరు మాత్రమే చెప్పలేని పరిస్థితి. కేవలం విజయాలను బట్టే బెస్ట్ అని చెప్పలేం. తాను ఉన్నప్పుడు జట్టును గెలిపించడంతో పాటు తన తర్వాత కూడా టీమ్ ఫ్యూచర్‌ను నిర్దేశించి వెళ్లే కెప్టెన్‌ను అత్యుత్తమంగా చెప్పొచ్చు. పైన పేర్కొన్న లాయిడ్, కపిల్, గంగూలీ, పాంటింగ్‌లు గొప్ప సారథులే. అయితే వీరి బాటలో నడిచిన మహేంద్ర సింగ్ ధోని గ్రేటెస్ట్ కెప్టెన్‌గా పేరు గడించాడు. టీమిండియాకు టీ20, వన్డే వరల్డ్ కప్‌లు అందించిన సారథిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
భారత జట్టుకు ప్రపంచ కప్స్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందించాడు ధోని. అలాగే టెస్టుల్లో జట్టును నంబర్ వన్‌గా చేశాడు. ఇక, ఐపీఎల్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. తాజాగా నెగ్గిన ఐపీఎల్-2023 కప్‌తో అతడి ఖాతాలో మొత్తం ఐదు ఐపీఎల్ ట్రోఫీలు చేరాయి. కెప్టెన్‌గా అతడు చూడని విజయం లేదు. భారత జట్టును విజయాల బాటలో నడిపిస్తూనే భవిష్యత్తు కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లను ప్రోత్సహించాడు మాహీ. ఐపీఎల్‌లోనూ ఎంతో మంది యంగ్‌స్టర్స్‌ను స్టార్లుగా తీర్చిదిద్దాడు. ఫామ్ కోల్పోయిన సీనియర్ ప్లేయర్లపై నమ్మకం ఉంచి, భుజం తట్టి ఆడించాడు. జట్టు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సంయమనం కోల్పోడు ధోని.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ టీమ్‌ను కూల్‌గా ఉంచుతాడు ధోని. కెరీర్లో ఇన్ని విజయాలు సాధించినా, ఇంత స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నా, కోట్ల కొద్దీ డబ్బులు ఉన్నా ధోని గొప్పతనం మాత్రం సింప్లిసిటీనే. స్టార్ ప్లేయర్లతో ఎలా ఉంటాడో, యంగ్‌స్టర్స్‌తోనూ అతడు ఒకేలా ప్రవర్తిస్తాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపే ధోని.. టీమ్ గెలిచి ట్రోఫీ తీసుకుంటే మాత్రం ఎక్కడో మూలన నిల్చుంటాడు. అతడి సింప్లిసిటీనే ఇతర కెప్టెన్ల నుంచి అతడ్ని వేరు చేస్తోంది. ఈ ఒక్క క్వాలిటీనే వరల్డ్ గ్రేటెస్ట్ కెప్టెన్‌గా ధోనీని నిలిపిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అతడి నుంచి మిగతా కెప్టెన్లు నేర్చుకోవాల్సింది ఈ గుణమేనని సూచిస్తున్నారు. మరి.. కెప్టెన్‌గా ధోనీలోని ఏ క్వాలిటీ మీకు బాగా ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Just Mahendra Singh Dhoni things 🤩
📸: IPL/BCCI pic.twitter.com/i5xHjoo4CL
— CricTracker (@Cricketracker) May 30, 2023