ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. తాము చేయని నేరాలకు పోలీసులు అన్యాయంగా స్టేషన్ లో వేశారని ఆవేదన చెందుతూ బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు.
తెలంగాణలో మరో దారుణం జరిగింది. పోలీసుల వేదింపులు తట్టుకోలేక వరంగల్ జిల్లా కు చెందిన వంశీ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్సై వేధిలపులు భరించలేక వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల వంచనగిరిలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది.. 5 తులాల బంగారం చోరీకి గురైంది. ఆ దొంగతనం వంశీ చేశాడని పోలీసులు అభియోగం మోపారు. అయితే తాను ఎలాంటి దొంగతనం చేయలేదని.. అన్యాయంగా తనను కేసులో ఇరికిస్తున్నారని వంశీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వంశీపై చేయి చేసుకున్నారు. దొంగిలించిన బంగారం ఎక్కడ దాచావో చెప్పాలని వంశిని అడిగారు పోలీసులు. తాను మాత్రం ఏ నేరం చేయలేదని.. చేయని దొంగతనం గురించి ఎలా చెప్పాలని నెత్తీ నోరు బాదుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే గీజుకొండ ఎస్సై వంశీపై చేయి చేసుకున్నట్లు సమాచారం. తనను అన్యాయంగా హింసిస్తున్నారని.. చేయని నేరానికి తనను దోషిగా చిత్రీకరిస్తూ తనపై చేయి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని వంశీ ముందుగానే పోలీసులకు చెప్పాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఈ క్రమంలోనే వంశీపై పోలీసులు చేయి చేసుకోవడం.. తటగ్టుకోలేక బలవన్మరణానికి పాల్పపడటం జరిగిందని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. నేరం ఒప్పుకోవాలని పోలీసులు తన కొడుకును ఎంతో ఒత్తిడి చేశారని.. ఆ ఒత్తిడి తట్టుకోలేక అన్యాయంగా తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి ఆరోపిస్తుంది. ఆపస్మారక స్థితిలో ఉన్న వంశీని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ వంశీ కన్నుమూశాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.