ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న రెండో రాత్రే భర్త కసాయిగా మారి స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 28న ఇక్డిల్ ప్రాంతంలో నివాసం ఉండే అమ్మాయికి థానా చౌబియా గ్రామంలో యువకుడికి ఘనంగా వివాహం జరిగింది. అయితే పెళ్లైన మొదటి రోజు నవ వధవుకి అత్తింటి వాళ్లు ఘనంగా స్వాగతం పలికారు.
ఇక మరుసటి రోజు రాత్రి నవ వధువు అస్వస్థతకు గురవ్వడంతో నవ వరుడు వధువుకి మత్తు మందు టాబ్లెట్ ఇచ్చాడు. టాబ్లెట్ వేసుకున్న వెంటనే నవ వధువు మత్తులోకి జారుకుంది. దీనినే ఆసరాగా చేసుకున్న కట్టుకున్న భర్త తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దాడికి కూడా పాల్పినట్లు తెలుస్తోంది. దీంతో స్ప్రుహ తప్పి పడడంతో వధువుని ఆస్పత్రికి తరలించిన వెంటనే అత్తమామలతో సహా భర్త పరారీలోకి వెళ్లిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న నవ వధువు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఇక నవ వధువు ప్రస్తుతం కోలుకుంటుందంటందని, ఆమెపై దాడి చేయడంతో లోలోపల అనేక గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు. అత్తింటి వాళ్ల జాడ తెలియకపోవడంతో వధువు మామ స్థానికుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఇంటి వాళ్లు తన మేనకోడలిపై పెళ్లైన తొలి రాత్రే అవమానించి దారుణంగా కొట్టారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తెలిపాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.