నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఈ ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారు జామున సమయంలో జరుగుతున్నాయి. తాజాగా అలా తెల్ల తెల్లవారే సమయంలో జరిగిన ఓ ఘోర ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, నిద్రమత్తు, మద్యం తాగి వాహనం నడపడం వంటివి ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రగాయల కారణంగా జీవితాన్ని అతికష్టం మీద వెలదీస్తున్నారు. ఇలా దూసుకొస్తున్న మృత్యువు కారణంగా ఎన్నో కుటుంబాలు తమ ఆధారాలను కోల్పోతున్నాయి. తాజాగా ఓ ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా శుభకార్యాల్లో వంటలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నలుగురు బలయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లికి చెందిన బైకని యాదయ్య(35), ముంత శ్రీనివాసులు(35), ఇమ్మరాసి రామస్వామి(36), హనుమంతు కేశవులు(33) శుభకార్యాల్లో వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున కారును డీసీఎం వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఈ నలుగురు మృతి చెందారు. వీరు వివిధ బృందాలుగా ఏర్పడి శుభకార్యాలకు వెళ్లి.. వంటలు చేస్తుండేవారు. ఇలా శుభకార్యాల్లో వంటలు చేయడం ద్వారా వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఇటీవల హైదరాబాద్ లోని ఓ ఓ శుభకార్యంలో వంటలు చేసే ఒప్పంద కుదిరింది. ఈ క్రమంలో గురువారం రాత్రి హైదరాబాద్ లోని ఆ వేడుకకు వంటలు చేసి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు.
శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గేట్ సమీపంలోకి మ్యాక్ ప్రాజెక్ట్ వద్దకు రాగానే ఈ ఘోరం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఆధారమైన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబాల వేదన చూసిన స్థానికుల మనస్సు కలచివేసింది. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.